మాటలు కాదు.. చేతల్లో చూపిన కేసీఆర్…

వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యా ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఇవాళ ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ‌-కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వి.. పారిపోవడానికి ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక దిశ మరణించిన ప్రదేశంలోనే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. […]

మాటలు కాదు.. చేతల్లో చూపిన కేసీఆర్...
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 06, 2019 | 3:53 PM

వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచారం, హత్యా ఉదంతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులను పోలీసులు ఇవాళ ఎన్‌కౌంటర్ చేశారు. సీన్ రీ‌-కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు పోలీసులపై రాళ్లు రువ్వి.. పారిపోవడానికి ప్రయత్నించగా.. ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్ చేశామని పోలీసులు చెబుతున్నారు. ఇక దిశ మరణించిన ప్రదేశంలోనే నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్ చేయడంతో దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సీన్  వెనుక సీఎం కేసీఆర్ మాస్టర్ మైండ్ ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే.. చూస్తూ ఊరుకునేది లేదంటూ సీఎం కేసీఆర్ ఈ విధంగా మృగాళ్లకు హెచ్చరికలు జారీ చేశారంటూ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

దిశ ఘటన జరిగిన తరుణంలో ఆర్టీసీ సమ్మె కీలక దశకు చేరుకుంది. ఇక ఈ అంశానికి పరిష్కారం లభించిన రోజున దిశ ఘటనపై కేసీఆర్ స్పందించారు. ఆ తర్వాత సుమారు 5 రోజుల వ్యవధిలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కేసీఆర్.. దిశ ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, సిట్ ఏర్పాటు చేసేలా చర్యలు కూడా తీసుకున్నారు. కానీ మొదటి నుంచే దేశవ్యాప్తంగా నిందితులను ఉరి తీయాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి.

అటు సజ్జనార్‌కు కూడా అనేక మంది ఫోన్లు, మెసేజ్‌‌ల రూపంలో.. 2008 వరంగల్‌లో చేసిన ఎన్‌కౌంటర్‌ను ఇక్కడ పునరావృతం చేయాలని కోరారు. ఇక సరిగ్గా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తు చేస్తూ సీఎం కేసీఆర్.. ప్రజలు ఎవ్వరూ లేని సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగేలా పక్కా ప్రణాళికను సిద్ధం చేశారని అందరూ అనుకుంటున్నారు. ఏది ఏమైనా కేసీఆర్.. మరోసారి తాను మాటలు చెప్పే సీఎం కాదని.. చేతల్లోనే చేసి చూపిస్తానని నిరూపించారు. కాగా, కేసీఆర్ తీరుపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ.. ఆయన ఆడవాళ్లకు అన్యాయం జరిగితే ఊరుకోరని స్పష్టం చేశారు.