తెలంగాణ రైతులకు శుభవార్త.. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. డిసెంబర్ 27వ తేదీ నుండి నేరుగా వారి ఖాతాల్లోకే..

ఈనెల 27వ తేదీ నుండి వచ్చే నెల 7వ తేదీ వరకు రైతులకు ‘రైతుబంధు’ సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

తెలంగాణ రైతులకు శుభవార్త.. సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్.. డిసెంబర్ 27వ తేదీ నుండి నేరుగా వారి ఖాతాల్లోకే..
Follow us

|

Updated on: Dec 07, 2020 | 5:32 PM

ఈనెల 27వ తేదీ నుండి జనవరి 7వ తేదీ వరకు రైతులకు ‘రైతుబంధు’ సాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రెండో విడత రైతుబంధు సాయం(యాసంగి సీజన్) పంపిణీకి సంబంధించి సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి.. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ రైతుబంధు సాయం అందించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. తక్కవ విస్తీర్ణం కలిగిన రైతులు మొదలు.. ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల వరకు అందరికీ పది రోజుల్లోగా డబ్బులు అందజేయాలన్నారు. సంబంధిత సొమ్మును నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇదిలాఉండగా, రైతులు యాసంగికి వ్యవసాయ పనులు ఇప్పటికే మొదలు పెట్టారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..