సీఎం టూర్ సక్సెస్..జగన్ ను కలిసిన టీజీ

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ కు స్థానిక బీజేపీ, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు.

సీఎం టూర్ సక్సెస్..జగన్ ను కలిసిన టీజీ
Follow us

|

Updated on: Feb 27, 2020 | 7:47 PM

సీఎం జగన్ ను కలిసిన టీజీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కర్నూలు పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ కు స్థానిక బీజేపీ, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి కుమారుడి వివాహ వేడుకకు వచ్చిన ఆయన వధూవరులను ఆశీర్వదించారు. అమరావతి నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన గన్నవరం నుంచి ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

ఓర్వకల్లు ఎయిర్ పోర్టులో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సీఎం జగన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్వాగతం పలికారు. టీజీతో పాటుగా ఎమ్మెల్యేలు కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, హఫీజ్‌ ఖాన్‌, బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువా కప్పారు. అనంతరం ఇద్దరూ ఎయిర్ పోర్టులో కాసేపు రాష్ట్ర పరిణామాలపై చర్చించుకున్నారు. అనంతరం సీఎం నేరుగా రాగమయూరి రిసార్ట్‌కు చేరుకుని వధూవరులను ఆశీర్వదించారు.

ఇదిలా ఉంటే..టీజీ వెంకటేష్ విమానాశ్రయానికి వెళ్లి మరీ జగన్‌కు స్వాగతం పలకడం అందరి దృష్టినీ ఆకర్షించింది. వీరి కలయిక వెనుక అసలు విషయం ఏంటా అనే సందేహాం సర్వత్రా వ్యక్తమైంది. దీంతో జగన్‌ను కలుసుకోవడం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేశారు టీజీ వెంకటేష్. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం పట్ల కృతజ్ఙతలు తెలియజేయడానికే తాను జగన్ ని కలిశానని వివరించారు. పవన విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయనను సంప్రదించానని చెప్పారు.

పవన విద్యుత్ ప్రాజెక్టులను విస్తరించడానికి గల అవకాశాలను పరిశీలించాలని సీఎంను కోరినట్లుగా చెప్పారు. ఈ మధ్యకాలంలో రాయలసీమలో విస్తృతంగా ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారని, ఈ కారణంతోనే తాను జగన్‌ను కలిశానని తెలిపారు. పార్టీ మారే ఉద్దేశం తనకు ఏ మాత్రం లేదని టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.