తిరుమలేశుని సన్నిధిలో అద్భుత దృశ్యం.. చూసితీరాల్సిందే !

తిరుమలేశుని సన్నిధిలో అద్భుత దృశ్యం.. చూసితీరాల్సిందే !

తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో బుధవారం తెలతెలవారుతుండగానే అద్భత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సప్తగిరులు ఎక్కుతున్న భక్త జనం ఈ దృశ్యాలను చూసి పరవశించిపోయారు. సహజంగానే వర్షాకాలంలోను, శీతాకాలంలోను తిరుమల కొండలు చూడచక్కని ప్రకృతి రమణీయతను సంతరించుకుని వుంటాయి. పచ్చని కొండల మధ్య సాగే హిల్ రూట్ జర్నీ ఆనంద పరవశులను చేస్తుంది. తిరుమల గిరులను మరింత అందంగా మారుస్తూ బుధవారం ఉదయం ఆవిష్కృతమైన దృశ్యం ప్రయాణీకులను ఆగి మరీ చూసి, తరించేలా చేసింది. గత వారం […]

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Oct 16, 2019 | 7:45 PM

తిరుమల శ్రీనివాసుని సన్నిధిలో బుధవారం తెలతెలవారుతుండగానే అద్భత దృశ్యం ఆవిష్కృతమైంది. శ్రీవారిని దర్శించుకునేందుకు సప్తగిరులు ఎక్కుతున్న భక్త జనం ఈ దృశ్యాలను చూసి పరవశించిపోయారు. సహజంగానే వర్షాకాలంలోను, శీతాకాలంలోను తిరుమల కొండలు చూడచక్కని ప్రకృతి రమణీయతను సంతరించుకుని వుంటాయి. పచ్చని కొండల మధ్య సాగే హిల్ రూట్ జర్నీ ఆనంద పరవశులను చేస్తుంది. తిరుమల గిరులను మరింత అందంగా మారుస్తూ బుధవారం ఉదయం ఆవిష్కృతమైన దృశ్యం ప్రయాణీకులను ఆగి మరీ చూసి, తరించేలా చేసింది.

గత వారం రోజులుగా తరచూ కురుస్తున్న వర్షాలు బుధవారం సుందర దృశ్య ఆవిష్కరణకు కారణమయ్యాయి. ఏడు కొండల చుట్టూ ప్రకృతి రమణీయతను పెంచాయి. పచ్చని చెట్లు, మంచు పొరలతో మరింత సుందరంగా మారిన తిరుమలేశుని సన్నిధి సినిమాల్లోని గ్రాఫిక్స్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా కనిపించాయి. మరీ ముఖ్యంగా రెండో ఘాట్ రైట్‌లో చేతిని తాకుతూ వెళ్లిన తెల్లని మేఘాలను అందుకోవాలని చూసిన ప్రతీ ఒక్కరు తహతహలాడిన పరిస్థితి.

ధవళవర్ణంలో చేతికి అందే లెవెల్‌లో, మోమును తాకేంతటి దగ్గరలో వెళుతున్న మేఘాలు ప్రతీ ఒక్కరిని ప్రకృతి ఒడిలోకి తీసుకు వెళ్ళాయంటే అతిశయోక్తి కాదు. పాల నురగలా దట్టంగా కనిపిస్తూ.. శ్రీవారి దర్శనానికి వెళుతున్న భక్తులు దారిలోనే విశ్రమించి ఆస్వాదించేలా చేశాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu