లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. దేశీయ కరెన్సీ రూపాయి బలపడటంతో పాటు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఉదయం నుంచే ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించిన సూచీలు మధ్యలో కాస్త ఒడిదొడికులు ఎదుర్కొన్నాయి. చివరకు మళ్లీ కోలుకుని లాభాలను నిలబెట్టుకున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11,500 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే […]

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Follow us

|

Updated on: Mar 18, 2019 | 4:57 PM

ముంబయి: దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. దేశీయ కరెన్సీ రూపాయి బలపడటంతో పాటు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను లిక్విడిటీ ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత్‌కు సైతం హఠాత్తుగా విదేశీ నిధుల ప్రవాహం పెరిగింది. ఉదయం నుంచే ట్రేడింగ్‌ను భారీ లాభాలతో ప్రారంభించిన సూచీలు మధ్యలో కాస్త ఒడిదొడికులు ఎదుర్కొన్నాయి. చివరకు మళ్లీ కోలుకుని లాభాలను నిలబెట్టుకున్నాయి.

ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 300 పాయింట్లకు పైగా లాభపడింది. నిఫ్టీ కూడా 11,500 మార్క్‌ పైన ట్రేడ్‌ అయ్యింది. అయితే ఆ తర్వాత ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో కాస్త ఒత్తిడికి గురైన సూచీలు ఆరంభ లాభాల్లో చాలా వరకు కోల్పోయాయి. ఒక దశలో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే చివరి గంటల్లో లోహ, బ్యాంకింగ్‌, ఎనర్జీ రంగాల షేర్లలో జరిగిన కొనుగోళ్లు సూచీలను నిలబెట్టాయి. మొత్తం నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 71 పాయింట్లు లాభపడి 38,095 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,462 వద్ద స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 55 పైసలు బలపడి 68.53గా కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడగా..ఎయిర్‌టెల్‌, ఐషర్‌ మోటార్స్‌, మారుతి సుజుకీ, హీరోమోటార్స్‌, విప్రో షేర్లు నష్టపోయాయి.