దీదీ ప్రకటన ఎఫెక్ట్, కోల్ కతాలో పరస్పరం రాళ్లు విసురుకున్న బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నగరం ఉద్రిక్తం,

కోల్ కతా లో సోమవారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • Umakanth Rao
  • Publish Date - 6:11 pm, Mon, 18 January 21
దీదీ ప్రకటన ఎఫెక్ట్, కోల్ కతాలో పరస్పరం రాళ్లు విసురుకున్న బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, నగరం ఉద్రిక్తం,

కోల్ కతా లో సోమవారం బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన కొద్దిసేపటికే.. ఈ పరిస్థితి ఏర్పడింది. బీజేపీలో చేరిన సువెందు అధికారి ఆధ్వర్యాన ఈ పార్టీ రోడ్ షో నిర్వహించగా ..టీ ఎం సీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపి రాళ్లు విసిరారు. వీరిపై బీజేపీ వర్గీయులు కూడా అదే పని చేశారు. కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి, రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్, సువెందు అధికారి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నేతల రోడ్ షో అభాసు పాలయింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగైదు నెలలు ఉండగానే పరిస్థితి ఇలా ఉండగా ఇక ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అమిత్ షా నిన్న ఈ రాష్ట్రంలో పర్యటించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజితం చేస్తున్నారు. లోగడ బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్ పై టీ ఎం సీ కారకర్తలుగా భావిస్తున్నవారు రాళ్ల దాడికి పాల్పడడంతో అప్పటి నుంచి రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది.


Read Also:ఫ్యాన్స్‌కి ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ టీమ్‌ స్పెషల్‌ దీపావళి గిఫ్ట్‌.. సంప్రదాయ దుస్తుల్లో అదరగొడుతున్న ఎన్టీఆర్‌, చెర్రీ.