10 రోజుల్లో 6…దేశాన్ని మలుపు తిప్పనున్న తీర్పులు

వచ్చే పది రోజులు భారత న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన రోజులుగా భావించాలి. దీపావళి పండుగ సెలవులు ముగిసిన తర్వాత నవంబర్ 4న సుప్రీం కోర్టు తిరిగి విచారణలు ప్రారంభించబోతోంది. అయితే.. నవంబర్ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ పదవీ విరమణ చేయనున్న ఆ లోగానే కొన్ని కీలకమైన తీర్పులు రాబోతున్నాయి. అయోధ్య కేసులో తీర్పు గురించి యావత్ భారతంలో కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. దాంతో పాటు రాఫెల్ ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు […]

10 రోజుల్లో 6...దేశాన్ని మలుపు తిప్పనున్న తీర్పులు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Nov 04, 2019 | 3:50 PM

వచ్చే పది రోజులు భారత న్యాయవ్యవస్థలో అత్యంత కీలకమైన రోజులుగా భావించాలి. దీపావళి పండుగ సెలవులు ముగిసిన తర్వాత నవంబర్ 4న సుప్రీం కోర్టు తిరిగి విచారణలు ప్రారంభించబోతోంది. అయితే.. నవంబర్ 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ పదవీ విరమణ చేయనున్న ఆ లోగానే కొన్ని కీలకమైన తీర్పులు రాబోతున్నాయి. అయోధ్య కేసులో తీర్పు గురించి యావత్ భారతంలో కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు.
దాంతో పాటు రాఫెల్ ఒప్పందంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పైనా తీర్పు రావడం ఖాయంగా కనిపిస్తోంది. శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళల ప్రవేశంపైనా, సమాచార హక్కు చట్టంలో మార్పులపై దాఖలైన పిటిషన్‌పైనా, ద్రవ్యబిల్లుపై దాఖలైన పిటిషన్‌పైనా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నుద్దేశించి చేసిన కామెంట్లపైనా.. ఇలా మొత్తం ఆరు కేసుల్లో తీర్పులను వెలువరించేందుకు  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ రెడీ అవుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. వీటిపై తీర్పులు ఎలా వున్నా.. ఈ తీర్పులు దేశం మీద గట్టి ప్రభావాన్నే చూపించబోతున్నాయి.
ఈ ఆరు  కేసుల్లో అత్యంత ప్రధానమైన అయోధ్య వివాదం. ఎన్నో దశాబ్ధాలుగా అయోధ్య వివాదం నడుస్తుండగా.. 1992లో వివాదాస్పద కట్టడాన్ని కూల్చేసిన తర్వాత కేసు మరింత జఠిలమైంది. మనది సెక్యులర్ దేశం.. మొదట్నించి మనం అలాగే వున్నాం. అయోధ్యలోని 2.77 ఎకరాల భూమిపై హక్కులు ఎవరికిస్తారు ? జడ్జిమెంట్ ఎలా వస్తుంది ? అలాగని కచ్చితమైన తీర్పు వస్తుందని కూడా అనుకోలేం. తీర్పును నిరవధికంగా వాయిదా వేసే అవకాశం లేకపోలేదు. అయిదుగురు సభ్యులున్న ధర్మాసనానికి చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్ సారథ్యం వహిస్తుండగా.. ఈ వివాదంపై వెలువడే తీర్పు దేశం మొత్తమ్మీద విపరీత ప్రభావాన్నే చూపనుంది. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అనుకుంటే అయోధ్య కేసులో తీర్పును ఇవ్వకపోనూ వచ్చు.
రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలుపై దాఖలైన కేసు కూడా సున్నితమైనదే. రక్షణ ఒప్పందాలలో కేంద్రం స్వయంగా ధరను నిర్ణయించ వచ్చా.. లేదా అన్నది ఈ కేసులో కీలకం. 2016లో రాఫెల్ ఒప్పందం జరిగినప్పట్నించి ఫ్రాన్స్ దేశం మనకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్ చాలా బలమైన దేశం. అలాంటి దేశం మనకు డైరెక్టుగా సహాయం చేయడంతోపాటు.. యూరోపియన్ యూనియన్‌లో భారత దేశం వాదనలను గట్టిగా సమర్థిస్తోంది. రక్షణ ఒప్పందం అంటే కేవలం ఆయుధాలు, యుద్ద వాహనాల కొనుగోలు మాత్రమే అనుకోవద్దు.. ఇది గుడ్‌విల్‌కు సంబంధించిన అంశం కూడా. గుడ్‌విల్‌ను కూడా కొనుగోలు చేయడం ద్వారా మన దౌత్య విధానంలో విదేశాల సహకారాన్ని కూడా కొనుక్కోవడమే.
సమాచార హక్కు చట్టంలో కేంద్రం మార్పులు చేర్పులు చేస్తుండడం కూడా వివాదాస్పదం అయ్యింది. ఈ మార్పులు అసలు చట్టాన్ని బలహీన పరుస్తాయని భావిస్తున్న వారు కోర్టును ఆశ్రయించారు. నిజానికి సమాచార హక్కు చట్టం పెద్దగా పనిచేయడం లేదు. అయితే.. ఎంతో కొంత ఉపయోగపడుతోంది ఈ చట్టం అని ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో చట్టంలో మార్పులపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది అందరూ ఆతృతతో వేచి చూస్తున్న అంశం.
శబరిమల ఆలయంలోకి యుక్త వయసు మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్ మీద కూడా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ అంశంపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. భక్తుల విశ్వాసాలు, ఆలయ ట్రస్టు బోర్డు సంప్రదాయాలను ఈ తీర్పు ప్రభావితం చేసే అవకాశం వుంది. హిందూమత విశ్వాసాలపై జోక్యం చేసుకునే సుప్రీంకోర్టు.. ఇతర మతాల సంప్రదాయాల విషయంలోను జోక్యం చేసుకుంటుందా అన్నది కూడా తేలాల్సిన అంశమే. ఈ కోణంలో చూస్తే శబరిమల కేసులో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు దేశవ్యాప్తంగా  పెద్ద ఇంపాక్ట్‌నే చూపే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇక మరో కీలకమైన కేసు ద్రవ్యబిల్లుపై దాఖలైన పిటిషన్. రాజ్యసభలో సమస్యలు వచ్చినప్పుడు దాని ఛైర్మన్ చేసే నోటిఫికేషన్, వెలువరించే నిర్ణయమే శిరోధార్యమా అనేది ద్రవ్య బిల్లుపై దాఖలైన కేసులో తీర్పు ద్వారా తేలే అవకాశం వుంది. ఏ సభ అయినా స్పీకర్ (రాజ్యసభలో ఛైర్మన్) తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని రాజ్యాంగ రచయితలు నిర్మోహమాటంగా పేర్కొన్నారు. దానికి రీజనింగ్ అక్కర్లేదని నా అభిప్రాయం. ఫైనాన్స్ బిల్లు కూడా ఒక చట్టమే అని గనక సుప్రీంకోర్టు తేలిస్తే.. ఈ తీర్పు చారిత్రాత్మకం అవుతుంది. ధర్మాసనం చేసే కామెంట్లు అత్యంత కీలకం కాబోతున్నాయి.
ఇక రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ‘‘ చౌకీదార్ చోర్ హై ’’ అన్న కామెంట్లు అత్యున్నత స్థానంలో వున్న వ్యక్తులపై ఇలాంటి కామెంట్లు చేయవచ్చా అన్న చర్చకు తెరలేపాయి. ఈ వ్యాఖ్యలు భావ ప్రకటా స్వేచ్ఛ పరిధిలోకి వస్తాయా లేక ఉన్నత స్థాయి వ్యక్తుల ప్రతిష్టకు భంగం వాటిల్ల చేయడం కింద వస్తాయా అన్నది తేలాల్సి వుంది. పరువునష్టం అనే దానికి ఏది ప్రాతిపదిక ? మనిషి పరువును ఎలా విలువ కడతారు ? లేదా పబ్లిక్ లైఫ్‌లో వున్నప్పుడు ఇలాంటి కామెంట్లను భరించాల్సిందేనా ? ఇలాంటి పలు ప్రశ్నలకు సుప్రీంకోర్టు తీర్పు సమాధానం చెప్పబోతోంది.
మనదేశంలో పార్లమెంటు, ప్రభుత్వం, సుప్రీంకోర్టు మూడు మూల స్థంభాలు. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా.. మిగితా రెండింటిపై దాని ప్రభావం వుంటుంది. పార్లమెంటు ఏదైనా చట్టం చేస్తే.. దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించవచ్చు.. అదే చట్టాన్ని మళ్ళీ చేస్తే సుప్రీంకోర్టు ఆమోదించవచ్చు. ఇక్కడ మనం బ్రిటన్ దేశాన్ని ప్రస్తావించుకోవాలి. బ్రిటన్ దేశానికి ఓ రాజ్యాంగం అంటూ లేదు. వెయ్యేళ్ళ ప్రాచీన చరిత్ర వున్న బ్రిటన్‌కు రాజ్యాంగం లేకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశమే. కానీ వారు ఎప్పటికప్పుడు పరిస్థితికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు చేసుకుంటూ పోతున్నారు.
నవంబర్ 17లోగా వచ్చే ఆరు కీలక తీర్పులు (వస్తాయని భావిస్తే) దేశంపై భారీ ప్రభావాన్నే చూపుతాయి. ఈ ప్రభావం ఏ స్థాయిలో వుంటుంది అన్నది వేచి చూడాల్సిన అంశం.

ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఈ సింపుల్ ప్లాన్ ఫాలో అయితే పదేళ్లలో కోటీశ్వరులవుతారు..
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా