విద్యార్థుల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా కీల‌క నిర్ణ‌యం… 25 శాతం సిలబస్‌ కుదింపు

వచ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ టెన్త్, ఇంట‌ర్ ఎగ్జామ్స్ సిలబస్‌ను 25 శాతం మేర తగ్గిస్తున్నట్టు కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ) శుక్రవారం అనౌన్స్ చేసింది.

విద్యార్థుల‌పై ఒత్తిడి ప‌డ‌కుండా కీల‌క నిర్ణ‌యం... 25 శాతం సిలబస్‌ కుదింపు
Follow us

|

Updated on: Jul 04, 2020 | 8:36 AM

వచ్చే అక‌డ‌మిక్ ఇయ‌ర్ టెన్త్, ఇంట‌ర్ ఎగ్జామ్స్ సిలబస్‌ను 25 శాతం మేర తగ్గిస్తున్నట్టు.. ఐసిఎస్‌ఇ, ఐఎస్‌సి వార్షిక పరీక్షలను నిర్వహించే.. కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికేట్‌ ఎగ్జామినేషన్‌ (సీఐఎస్‌సీఈ) శుక్రవారం అనౌన్స్ చేసింది. క‌రోనా వ్యాప్తి, లాక్‌డౌన్ వంటి కార‌ణాల వ‌ల్ల‌‌ విద్యార్థులకు పూర్తిస్థాయిలో క్లాసులు నిర్వహించటం సాధ్యం కాదని, అందుకే సిలబస్‌ను తగ్గిస్తున్నట్టు సీఐఎస్‌సీఈ కార్యదర్శి గెర్రీ అరతూన్ వెల్లడించారు.

కాగా, కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో రద్దు చేసిన సీఐఎస్‌సీఈ 10,12వ తరగతుల ఎగ్జామ్స్ కు సంబంధించి మార్కుల కేటాయింపు విధానాన్ని బోర్డు శుక్రవారం ప్రకటించింది. బోర్డు ఎగ్జామ్స్ లో ఎక్కువ మార్కులు వచ్చిన మూడు సబ్జెక్టుల స‌గ‌టు, మిగిలిన సబ్జెక్టుల్లో ఇంటర్నల్స్ ప్రామాణికంగా తీసుకుని మిగతా సబ్జెక్టులకు మార్కులను కేటాయించనున్నట్టు వివ‌రించింది. ఎగ్జామ్ రిజ‌ల్ట్స్ ఈనెల‌ 15వ తేదీలోగా రిలీజ్ చేయనున్నట్టు అధికారులు శుక్రవారం తెలిపారు.