ఆమె రాజకీయాలు మానేస్తే మంచిది.. సినీ రచయిత పరుచూరి కోరిక

ఆమె రాజకీయాలు మానేస్తే మంచిది.. సినీ రచయిత పరుచూరి కోరిక

కుటుంబ కథా చిత్రాల నుంచి మొదలై.. టాలీవుడ్‌ నెంబర్ వన్ హీరోయిన్‌గా స్ధానం సంపాదించి.. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుతో ఓ వెలుగు వెలిగిన తార విజయశాంతి. కర్తవ్యం చిత్రం ఆమె సినీ జీవితాన్ని మరోవైపునకు తిప్పితే.. దర్శకరత్న దాసరి తీసిన ఒసేయ్ రాములమ్మ చిత్రం మరో కీలక మలుపునకు తిప్పింది. అప్పటి వరకు తెలుగు తెరపై నటించి మెప్పించిన విజయశాంతి.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోషించిన పాత్ర ఎంతో ఉంది. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 16, 2019 | 8:44 PM

కుటుంబ కథా చిత్రాల నుంచి మొదలై.. టాలీవుడ్‌ నెంబర్ వన్ హీరోయిన్‌గా స్ధానం సంపాదించి.. ఏకంగా లేడీ సూపర్‌స్టార్ బిరుదుతో ఓ వెలుగు వెలిగిన తార విజయశాంతి. కర్తవ్యం చిత్రం ఆమె సినీ జీవితాన్ని మరోవైపునకు తిప్పితే.. దర్శకరత్న దాసరి తీసిన ఒసేయ్ రాములమ్మ చిత్రం మరో కీలక మలుపునకు తిప్పింది. అప్పటి వరకు తెలుగు తెరపై నటించి మెప్పించిన విజయశాంతి.. రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విజయశాంతి పోషించిన పాత్ర ఎంతో ఉంది. రాష్ట్ర విభజన కోరుతూ తల్లి తెలంగాణ పార్టీని కూడా స్ధాపించి తనదైన ప్రత్యేకతను సైతం చాటుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలనుంచి ఎంపీగా సేవలందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి సమన్యాయం జరగాలన్నదొక్కడే విజయశాంతి కోరుకుంటారు.

వెండితెరకు పూర్తిగా దూరమై పూర్తిస్థాయి రాజకీయ నేతగా కొనసాగుతున్న విజయశాంతి.. చాల సంవత్సరాల తర్వాత మరోసారి వెండితెరమీద కనిపించబోతున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా రాబోతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు” ఈ మూవీలో విజయశాంతి ఓ ప్రత్యేక పాత్రను పోషించారు. గతంలో మహేశ్ బాలనటుడిగా ద్విపాత్రాభినయం చేసిన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో హీరో కృష్ణ సరసన విజయశాంతి నటించారు. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత మహేశ్‌తో కలిసి కనిపించబోతున్నారు విజయశాంతి.

ఇదిలా ఉంటే విజయశాంతి ఇక రాజకీయాల్లోకి వెళ్లొద్దంటు కోరుతున్నారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. ఇప్పటికే రాజకీయాలంటే ఎలా ఉంటాయో ఆమెకు అర్ధమయ్యే ఉంటుందన్నారు. విజయశాంతిని తెరమీద చూడాలని ఎంతోమంది కోరుకుంటున్నారని, ఇలాంటి సమయంలో మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లడం అంత మంచిదికాదేమో అనే అభిప్రాయాన్ని పరుచూరి వ్యక్తం చేశారు. విజయశాంతి ఎంతో మంచి నటి అని అలాంటి నటి వెండితెరకు దూరం కావడం సరికాదని ఈ సీనియర్ రచయిత చెబుతున్నారు. రాజకీయాలను విడిచిపెట్టి పూర్తిగా సినీరంగంలోకి వచ్చి ప్రేక్షకుల్ని అలరిస్తే బాగుంటుందంటూ తన మనసులోని మాటను వెల్లడించారు.

హీరో మహేశ్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విజయశాంతి ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రను చేస్తున్నారు. అలాగే మరో పాత్రలో పరుచూరి కూడా నటిస్తుండటం విశేషం.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu