సంజూ భాయ్ మీరు త్వరగా కోలుకోవాలి…

బాలీవుడ్ కల్ నాయక్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ అని వార్తలు రావడంతో సినిమా ప్రపంచం మొత్తం ఆందోళనకు గురైంది. ఇదే అంశంపై మెగా స్టార్ చిరంజీవి...

  • Sanjay Kasula
  • Publish Date - 9:07 pm, Wed, 12 August 20
సంజూ భాయ్ మీరు త్వరగా కోలుకోవాలి...

బాలీవుడ్ కల్ నాయక్ సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ అని వార్తలు రావడంతో సినిమా ప్రపంచం మొత్తం ఆందోళనకు గురైంది. ఇదే అంశంపై మెగా స్టార్ చిరంజీవి స్పందించారు. తన సోషల్ మీడియా ఖాతాలో సంజయ్ దత్ ఆరోగ్యం పై ట్వీట్ చేశారు. ప్రియమైన సంజయ్ దత్ భాయ్.. మీరు ఇలాంటి ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారని తెలుసుకోవడం చాలా బాధగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  అనేక సంక్షోభాలను అధిగమించారు… మీరు ఈ అనారోగ్య సమస్య నుండి త్వరగా బయటకు వస్తారనడంలో సందేహం లేదంటూ అభిప్రాయపడ్డారు.

“ప్రియమైన సంజయ్ భాయ్.. మీరు ఈ ఆరోగ్య పరిస్థితిని ఎదుర్కొన్నారని తెలుసుకోవడం బాధగా ఉంది. కానీ మీరు ఒక పోరాట యోధుడు… సంవత్సరాలుగా అనేక సంక్షోభాలను అధిగమించారు. ఎగిరే రంగులతో మీరు దీని నుండి బయటకు వస్తారనడంలో సందేహం లేదు. మీరు త్వరగా కోలుకోవాలని  ప్రార్థిస్తున్నాను.” అని తన ట్విట్టర్ ఖాతాలో మెగా స్టార్ చిరంజీవి స్పందించారు.