బ్రేకింగ్ః చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్

ప్రస్తుతం ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతూండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు..

బ్రేకింగ్ః చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా పాజిటివ్

ప్రస్తుతం ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. రోజురోజుకీ కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతూండటంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ, క్రీడా సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతూండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఏపీ స్పీకర్‌ కోన రఘుపతి, ఆయన భార్యకు కూడా కరోనా సోకిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తాజాగా ఇప్పుడు మరో ఏపీ ఎమ్మెల్యేకు కోవిడ్‌ నిర్థారణ అయింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు కరోనా సోకింది. దీంతో ఆయన బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్‌లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అలాగే ఎమ్మెల్యే కరణం కుటుంబ సభ్యులతో పాటు, ఆయనతో కాంటాక్ట్‌ అయిన అందరికీ కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు వైద్యులు.

Read More: తెలంగాణ కరోనా బులిటెన్: మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు

Click on your DTH Provider to Add TV9 Telugu