ఒకప్పుడు చింతామణి నాటకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ఓ ఊపు ఊపేసింది. తెలుగు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం శతజయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐతే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆ నాటక శతజయంతి వేడుకలపై వివాదం నెలకొంది. చింతామణి నాటకాన్ని ప్రదర్శిచ్చొందని డిమాండ్ చేస్తున్నాయి ఆర్యవైశ్య సంఘాలు. శతజయంతి వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శతజయంతి పేరుతో నాటకం ప్రదర్శిస్తే ఉద్యమం చేస్తామంటున్నారు ఆర్య వైశ్యులు. చింతామణి నాటకం సాంఘిక దురాచారాలను అరికట్టేందుకు రాసిన నాటకమని.. మాజీ సీఎం రోశయ్య హయాంలో నాటక ప్రదర్శన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని అంటున్నారు. ఆర్య వైశ్యుల మనోభావాలను కించపరుస్తూ చింతామణి నాటకాన్ని ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.