చైనాలో మరో విషాదం.. కరోనాను కనిపెట్టిన వైద్యుడు ఇకలేరు..

కరోనా.. ఈ వైరస్ గురించి తెలియని వారుండరు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే తొలుత ఇది చైనాలో ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించారు వుహాన్ లీ వెన్ లియాంగ్ అనే వైద్యుడు. అయితే ఇదే వైరస్ బారిన పడిన ఆ వైద్యుడు.. శుక్రవారం తెల్లవారుజామును ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే దాదాపు 630 మందికి పైగా మృత్యువాత పడ్డారు. సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు […]

చైనాలో మరో విషాదం.. కరోనాను కనిపెట్టిన వైద్యుడు ఇకలేరు..

కరోనా.. ఈ వైరస్ గురించి తెలియని వారుండరు. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే తొలుత ఇది చైనాలో ప్రబలుతోందని తోటి వైద్యులను హెచ్చరించారు వుహాన్ లీ వెన్ లియాంగ్ అనే వైద్యుడు. అయితే ఇదే వైరస్ బారిన పడిన ఆ వైద్యుడు.. శుక్రవారం తెల్లవారుజామును ఈ లోకాన్ని విడిచివెళ్లాడు. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే దాదాపు 630 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

సీఫుడ్‌ మార్కెట్‌కు చెందిన ఏడుగురు వ్యక్తులు తమ ఆస్పత్రిలో చేరారని.. వారికి ప్రత్యేక పరీక్షలు చేయగా.. సార్స్ బారిన పడ్డారని తేలిందని లీ పేర్కొన్నారు. దేశంలో ఈ వైరస్‌ అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందంటూ లీ.. తన సోషల్ మీడియా గ్రూప్‌లలో గతేడాది డిసెంబర్ 30న పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌లపై ఆగ్రహించిన అక్కడి పోలీసులు.. ఆయన్ను తీవ్రంగా ఇబ్బందులకు గురించేశారు. ఈ క్రమంలో ఆయన కూడా కరోనా బారిన పడి.. జనవరి 12 నుంచి ఆస్పత్రిలోనే ఉన్నారు. చివరకు చికిత్స పొందుతూ.. శుక్రవారం తెల్లవారు జామున కన్నుమూశారు.

కాగా.. తొలుత పోలీసులు ఆయన్ను ఇబ్బందులకు గురిచేసినా.. విషయం అర్ధమయ్యాక.. కరోనా వైరస్ ప్రబలిందని తెలియగానే.. అధికారులు వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వైద్యుడే కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో.. చైనీయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయన మృతిపై సంతాపం తెలుపుతున్నారు.

Published On - 10:51 am, Fri, 7 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu