ఐసీఐసీఐ బ్యాంకులో చైనా పెట్టుబడులు, ఎంతంటే ?

చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని ఓ వైపు దేశమంతా గగ్గోలు పెడుతుంటే మరో వైపు చైనా మాత్రం కామ్ గా తన పెట్టుబడులను భారతీయ సంస్థలు, బ్యాంకుల్లో పెడుతోంది. తాజాగా  చైనా సెంట్రల్ బ్యాంకు..

ఐసీఐసీఐ బ్యాంకులో చైనా పెట్టుబడులు, ఎంతంటే ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Aug 18, 2020 | 12:53 PM

చైనా ఉత్పత్తులను బాయ్ కాట్ చేయాలని ఓ వైపు దేశమంతా గగ్గోలు పెడుతుంటే మరో వైపు చైనా మాత్రం కామ్ గా తన పెట్టుబడులను భారతీయ సంస్థలు, బ్యాంకుల్లో పెడుతోంది. తాజాగా  చైనా సెంట్రల్ బ్యాంకు.. ఐసీఐసీఐ  బ్యాంకులో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులను పెట్టింది. క్వాలిఫైడ్ ఇన్స్ టిట్యూషనల్ ప్లేస్ మెంట్ ఒప్పందం కింద ఈ సొమ్ము తాలూకు చెక్ పై చైనా సెంట్రల్ బ్యాంకు అధికారులు సంతకాలు చేశారు. కాగా బ్యాంకింగ్ రంగం ఉన్నత రెగ్యులేటింగ్ బిజినెస్ లావాదేవీలతో కూడినదైనందున ఈ ఇన్వెస్ట్ మెంట్స్ హానికరం కాదని నిపుణులు అంటున్నారు.

ఐసీఐసీఐ బ్యాంకులో  సింగపూర్ ప్రభుత్వం, మోర్గాన్ ఇన్వెస్ట్ మెంట్ సొసైటీ జనరల్ వంటి ఇతర సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. అసలు ఇండియాలో చైనా పెట్టుబడులపై ఆంక్షలు లేవన్న విషయాన్నినిపుణులు గుర్తు చేస్తున్నారు.