భారత విజ్ఞప్తికి నో చెప్పిన చైనా

భారత విజ్ఞప్తికి నో చెప్పిన చైనా

భారత్‌పై చైనా అక్కసు భారత విజ్ఞప్తికి నో అన్న చైనా న్యూఢిల్లీ: 42 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల వీర మరణంతో యావత్తు భారత దేశం శోకంలో మునిగింది. ఒకపక్క శోకంతో పాటు ఇంకోపక్క ఆగ్రహం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేందుకు పూనుకుంది. దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో దాన్ని టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌లో ఈ సంస్థ బాగా వేళ్లూనుకుని ఉంది. […]

Vijay K

| Edited By: Ravi Kiran

Sep 01, 2020 | 7:22 PM

  • భారత్‌పై చైనా అక్కసు భారత విజ్ఞప్తికి నో అన్న చైనా

న్యూఢిల్లీ: 42 మంది సీఆర్పిఎఫ్ జవాన్ల వీర మరణంతో యావత్తు భారత దేశం శోకంలో మునిగింది. ఒకపక్క శోకంతో పాటు ఇంకోపక్క ఆగ్రహం కూడా వ్యక్తం అవుతూ ఉంది. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేందుకు పూనుకుంది. దాడి చేసింది తామేనని జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించడంతో దాన్ని టార్గెట్ చేసింది. పాకిస్థాన్‌లో ఈ సంస్థ బాగా వేళ్లూనుకుని ఉంది. దీనికి బాస్ అయిన మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చేందుకు తమకు మద్దతివ్వాలని కోరింది.

అయితే చైనా వెంటనే నో చెప్పింది. చైనా ఓకె అనకపోతే అంతర్జాతీయంగా ఏ నిర్ణయం కూడా అమలులోకి రాకపోవచ్చు. వీటో పవర్ ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు అంగీకారం ముఖ్యం. ఏ ఒక్కటి నో అన్నా కుదరని పరిస్థితి ఉంది. అయితే భారత విజ్ఞప్తికి నో చెప్పిన చైనా సానుభూతి మాత్రం ప్రకటించింది. దాడిలో కన్నుమూసిన జవాన్లకు ప్రగాఢ సానుభూతి అని, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఖండిస్తామని చైనా విదేశాంగ ప్రతినిధి గెంగ్ షుయాంగ్ చెప్పారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu