అమెరికాకు చైనా వార్నింగ్..

అమెరికాకు చైనా వార్నింగ్..

అమెరికాపై చైనా విరుచుకుపడింది.  దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ అమెరికా ప్రెసిడెంట్   ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది.  తమ దేశానికి చెందిన వాణిజ్య కంపెనీలకు తాము మద్దతుగా ఉంటామని చైనా స్పష్టం చేసింది. ట్రాంప్ తీసుకునే నిర్ణయం అనంతర పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అమెరికాను హెచ్చరించారు.  అమెరికా వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామని అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా చర్యలతో వాణిజ్య […]

Sanjay Kasula

|

Aug 07, 2020 | 8:16 PM

అమెరికాపై చైనా విరుచుకుపడింది.  దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ అమెరికా ప్రెసిడెంట్   ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా మండిపడింది.  తమ దేశానికి చెందిన వాణిజ్య కంపెనీలకు తాము మద్దతుగా ఉంటామని చైనా స్పష్టం చేసింది. ట్రాంప్ తీసుకునే నిర్ణయం అనంతర పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అమెరికాను హెచ్చరించారు.  అమెరికా వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నామని అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా చర్యలతో వాణిజ్య కంపెనీల, వినియోగదారుల ప్రయోజనాలను అమెరికా విస్మరిస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ సమీకరణాలను తారుమారు చేయడం, అణచివేతకు గురిచేయడంలో భాగమేనని అన్నారు.

ఇదిలావుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై టిక్ టాక్ సంస్థ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తాము అమెరికా చట్టాలకు అతిక్రమించలేదనే విషయాన్ని స్పష్టం చేసేందుకు తమకున్న అన్ని దారుల్లో కృషిచేస్తామని టిక్‌టాక్‌ ప్రకటించింది. ప్రభుత్వంతో కాకుంటే అమెరికా న్యాయస్థానాల్లో దీనిపై పోరాడుతామని ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికాలో టిక్‌టాక్‌తో పాటు వియ్‌చాట్‌ యాప్‌లపై వచ్చే 45రోజుల్లో నిషేధించాలనే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu