చైనాలో మళ్ళీ కోవిడ్-19 కలకలం.. 10 ప్రాంతాల్లో లాక్ డౌన్ విధింపు

చైనాలో సెకండ్ వేవ్ కోవిడ్-19 కలకలం మొదలైంది. ఓ హోల్ సేల్ మార్కెట్ కి వఛ్చినవారిలో 75 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. నిన్నటికి నిన్న జిన్ ఫాదీ మార్కెట్ లో 49 కరోనా కేసులు కనుగొన్నారు....

చైనాలో మళ్ళీ కోవిడ్-19 కలకలం.. 10 ప్రాంతాల్లో లాక్ డౌన్ విధింపు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 15, 2020 | 11:29 AM

చైనాలో సెకండ్ వేవ్ కోవిడ్-19 కలకలం మొదలైంది. ఓ హోల్ సేల్ మార్కెట్ కి వఛ్చినవారిలో 75 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. నిన్నటికి నిన్న జిన్ ఫాదీ మార్కెట్ లో 49 కరోనా కేసులు కనుగొన్నారు. ఇక బీజింగ్ సిటీలో 36 కేసులు బయటపడ్డాయి. హైదియన్ జిల్లాలోని యాంగ్ డాంగ్ హోల్ సేల్ మార్కెట్ లో కొత్తగా ఈ కేసులు వెలుగులోకి వచ్చాయని నగర మేయర్ లీ-జున్ జీ వెల్లడించారు. దీంతో ఈ మార్కెట్ తో బాటు దగ్గరలోని స్కూళ్లను, షాపులను మూసివేశామని, అలాగే చుట్టుపక్కలగల ఇళ్లవారిని బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశామని చెప్పారు. కొత్తగా  10 ప్రాంతాల్లో విధించిన లాక్ డౌన్ వల్ల కొన్ని వేల మంది ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. బీజింగ్ లోని ఓ స్టేడియం వద్ద సోమవారం అనేకమంది కరోనా టెస్టుల కోసం బారులు తీరారు. ఈ నగరానికి వెళ్లవద్దని కొన్ని సిటీల అధికారులు తమ ప్రజలను కోరారు. స్కూళ్ళు మళ్ళీ తెరుస్తున్నారని సంబరంతో వచ్చిన పలువురు విద్యార్థులు.. తాజాగా ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఫలితంగా తిరిగి ఇళ్లకు మళ్లుతున్నారు.