CM KCR: రేపటి నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. జనగామ సభకు గులాబీ శ్రేణుల భారీ ఏర్పాట్లు..

CM KCR: రేపటి నుంచి సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. జనగామ సభకు గులాబీ శ్రేణుల భారీ ఏర్పాట్లు..
Cm Kcr

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( CM KCR) శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణపై మోదీ కామెంట్స్‌ తర్వాత సీఎం ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో ఈ టూర్‌కు మరింత ప్రాధాన్యత వచ్చింది..

Sanjay Kasula

|

Feb 10, 2022 | 9:34 PM

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు( CM KCR) శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటిస్తారు. తెలంగాణపై మోదీ కామెంట్స్‌ తర్వాత సీఎం ఓ భారీ బహిరంగ సభలో పాల్గొనడంతో ఈ టూర్‌కు మరింత ప్రాధాన్యత వచ్చింది.. జనగాం వేదికగా గులాబీ బాస్‌ సమరశంఖం పూరిస్తారా? ప్రధాని మోదీకి ఎలాంటి కౌంటర్ ఇస్తారు? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ హాట్ టాపిక్‌గా మారింది. శుక్రవారం నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుడుతున్నారు సీఎం కేసీఆర్. జనగామ జిల్లా వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభా వేదికగా రాష్ట్ర అభివృద్ధిని వివరిస్తారు సీఎం కేసీఆర్. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై గులాబీ శ్రేణులు ఇప్పటికే భగ్గుమంటున్నాయి. అటు ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్‌ కూడా ఇచ్చారు.

మరి ఈ ఎపిసోడ్‌పై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. అటు ఈ సభను జిల్లా మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇప్పటికే జనగామ అంతా గులాబీమయం అయిపోయింది.

జనగామలో ఇప్పటికే టీఆర్ఎస్ (TRS) బీజేపీ(BJP)ల మధ్య ఓ రేంజ్‌లో వార్ నడుస్తోంది. రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. బీజేపీ కార్యకర్తల్ని పరామర్శించేందుకు జనగామ వెళ్లాలనుకున్న ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రాజాసింగ్‌లను పోలీసులు హౌజ్‌అరెస్ట్ చేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు 12వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు సీఎం కేసీఆర్. టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఇవి కూడా చదవండి: UP Election 2022: మీ వెంట మేమున్నాం.. ముస్లిం మహిళల పోరాటంపై ప్రధాని మోడీ ప్రశంసలు..

Andhra Pradesh: అప్పటికల్లా కొత్త జిల్లాల ఏర్పాటు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu