రైతులకు మద్దతుగా భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ, కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం,

రైతులకు మద్దతుగా భోపాల్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ రసాభాసగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యాన..

  • Umakanth Rao
  • Publish Date - 6:07 pm, Sat, 23 January 21
రైతులకు మద్దతుగా భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ, కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం,

రైతులకు మద్దతుగా భోపాల్ లో శనివారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీ రసాభాసగా మారింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రాజ్ భవన్ ముట్టడికి బయల్దేరారు.  రాజ్ భవన్ వద్ద వీరిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కార్యకర్తలు వారిపైకి దూసుకువెళ్లడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బాష్ప వాయువు , జల ఫిరంగులు ప్రయోగించారు. ఈ ఘటనలో అనేకమంది కార్యకర్తలు, పోలీసులు కూడా గాయపడ్డారు. చేత పార్టీ పతాకాలను పట్టుకుని ఖాకీల వైపు దూసుకువెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తల దూకుడుకు సంబంధించిన దృశ్యాల తాలూకు వీడియోలు సంచలనంగా మారాయి. నిజానికి రైతుల ఆందోళనపై రాష్ర అన్నదాతలను చైతన్య పరచేందుకు కమల్ నాథ్ ఈ ర్యాలీని ఆర్భాటంగా చేబట్టారు. కానీ కార్యకర్తల, పోలీసుల అత్యుత్సాహంతో ఈ కార్యక్రమం రసాభాస అయింది. అయితే తమ ప్రోగ్రాం సక్సెస్ అయిందని కమల్ నాథ్ ఆ తరువాత తెలిపారు.

బీహార్ లో  కూడా ప్రతిపక్ష ఆర్జేడీ ఈ నెల 24 నుంచి వారం రోజులపాటు..ఈ నెల 30 వరకు రైతుల జాగృత్ సప్తాహ్ ని నిర్వహిస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ నేతృత్వాన ఈ కార్యక్రమం జరగనుంది.


Read Also:రైతును మోసం చేసిన విత్తన సంస్థకు ఫైన్.. రూ.2.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశం.
Read Also :రాహుల్ గాంధీలో ఆ క్వాలిటీ లేదు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సంచలన వ్యాఖ్యలు.