Chandrababu fire: పులివెందుల రాజకీయం చేస్తే తోక కోస్తా..!

ఏపీ సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన ఏడు నెలల తర్వాత చంద్రబాబు తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సోమవారం పర్యటించారు

Chandrababu fire: పులివెందుల రాజకీయం చేస్తే తోక కోస్తా..!
Follow us

|

Updated on: Feb 24, 2020 | 6:21 PM

Chandrababu serious comments on CM Jagan: ఏపీ సీఎం జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగారు విపక్ష నేత చంద్రబాబు నాయుడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం పొందిన ఏడు నెలల తర్వాత చంద్రబాబు తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సోమవారం పర్యటించారు. చంద్రబాబు రాక సందర్భంగా కుప్పం ఏరియాలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడంతో పోలీసులకు పనిపడింది.

పోలీసుల భారీ బందోబస్తు మధ్య చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. ఈ సందర్భంగా రాళ్ళబూదుగురులో చంద్రబాబుకు పార్టీ కేడర్ ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. సీపీ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చంద్రబాబు ఏపీలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని విమర్శించారు. పులివెందుల తరహా రాజకీయం చేస్తే తోకలు కట్ చేస్తామని చంద్రబాబు సీఎం జగన్‌ను హెచ్చరించారు. జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం రంగుల మార్చే ప్రభుత్వమని ఆరోపించారు చంద్రబాబు.

అనంతరం తన పర్యటనను కొనసాగించిన చంద్రబాబు.. టీడీపీ ఆవిర్భావం నుంచి 22 ఏళ్ల పాటు రాష్ట్రంలో టీడీపీ పాలన కొనసాగిందన్నారు. కానీ.. ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని గతంలో తానెప్పుడు చూడలేదని ఆయనన్నారు. రౌడీయిజం చేస్తే తోకలు కట్ చేసి ప్రజాస్వామ్యంలో దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు. పోలీసులు చట్టాన్ని గౌరవించి కాపాడాలని ఏ ఒక్కరికి తొత్తుల్లా మారొద్దని చంద్రబాబు హెచ్చరించారు.

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఆర్నెల్లు మాట్లాడనని చెప్పానని, కానీ వారం రోజుల్లోనే ప్రజావేదికను కూల్చడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిహసించడం మొదలు పెట్టారని అన్నారు చంద్రబాబు. ‘‘ఎన్నికల ముందు ముద్దులు పెట్టారు..ఇప్పుడు పిడి గుద్దులు గుద్దు తున్నారు’’ అంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసన్న చంద్రబాబు.. గతంలో సీబీఐ విచారణ అడిగిన జగన్ ఇప్పుడు సీబీఐకి ఇచ్చేందుకు ఎందుకు జంకుతున్నారని నిలదీశారు చంద్రబాబు.

Also read: Janasena crucial step ahead జనసేన పయనంలో కీలక అడుగు