#COVID2019 జగన్ కూతుళ్ళకు కరోనా టెస్టులు.. చంద్రబాబేనా ఈ మాటన్నది?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూతుళ్ళిద్దరు ఇటీవల విదేశాల నుంచి వచ్చినందున వారిద్దరికీ కరోనా వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.

#COVID2019 జగన్ కూతుళ్ళకు కరోనా టెస్టులు.. చంద్రబాబేనా ఈ మాటన్నది?
Follow us

|

Updated on: Mar 18, 2020 | 7:33 PM

Chandrababu demands Covid test for Jagan’s daughters: టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తిని ముఖ్యమంత్రి జగన్ ఉద్దేశపూర్వకంగా దాచి పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రానికి 11వేల మందికి పైగా విదేశాల నుంచి వస్తే.. వారికి వైద్య పరీక్షలు నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారని చంద్రబాబు అంటున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో ముఖ్యమంత్రి కూతుళ్ళు కూడా వున్నారని.. వారికి కరోనా పరీక్షలు చేయించాల్సి వస్తుందనే కరోనాపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్నా కావాలనే దాచి పెడుతున్నారు.. రాష్ట్రానికి ఎంత మంది విదేశీయులు వచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.. కేంద్రం లెక్కల ప్రకారం 11వేల మంది ఏపీ కి వచ్చారు.. వారిపట్ల రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన పర్యవేక్షణ ఏమిటి? జగన్ కుమార్తెలు కూడా విదేశాల నుంచి వచ్చారని అంటున్నారు.. అలా వచ్చి ఉంటే వారినీ 14 రోజుల పర్యవేక్షణలో పెట్టాలి.. ’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ఐసోలేషన్ వార్డులు ఎక్కడెక్కడ పెట్టారని ప్రశ్నించారయన. ఏడాది అవుతున్నా తనను, తెలుగుదేశం పార్టీని తిట్టడం తప్ప రాష్ట్రం కోసం ఏం చేశారని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రభుత్వానికి పట్టకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానని, వీలైనంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చంద్రబాబు ప్రజలకు సూచించారు. కరోనాపై అవగాహన కల్పించే బుక్ లెట్‌ను విడుదల చేశారు చంద్రబాబు.