బరిలోకి బాబు.. 14న ఏం చేయబోతున్నారంటే ?

ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు. నవంబర్ 14న రంగంలోకి దిగేందుకు చంద్రబాబు నాయుడు ముహూర్తం నిర్ణయించారు. […]

బరిలోకి బాబు.. 14న ఏం చేయబోతున్నారంటే ?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 11, 2019 | 6:21 PM

ఏపీలో కొనసాగుతున్న ఇసుక ఆందోళన మరింత ఉధృతం చేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఇసుకతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ భవనాల విక్రయం వంటి అంశాల ఆధారంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు టిడిపి నేతలు దేవినేని ఉమ, కేశినేని నాని, బోండా ఉమ, బుద్దా వెంకన్న సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు.

నవంబర్ 14న రంగంలోకి దిగేందుకు చంద్రబాబు నాయుడు ముహూర్తం నిర్ణయించారు. ఇసుక విధానంలోని లోపాలను హైలైట్ చేయడంతోపాటు కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం పేరిట తెలుగు భాషను చంపేస్తున్నారని, రాష్ట్రంలోని విలువైన, మూల్యమైన ప్రభుత్వ భూములను విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆయా అంశాలను కూడా హైలైట్ చేసేందుకు విజయవాడ వేదికగా నిరాహార దీక్షను నిర్వహించాలని తలపెట్టారు. ఈ విషయంపైనే సోమవారం టిడిపి నేతలు కేశినేని భవన్‌లో సమావేశమయ్యారు.

ఇసుక కొరత పై ఈ నెల 14 న ధర్నా చౌక్ లో చంద్రబాబు నిరాహారదీక్ష చేపడతారని, ఈ దీక్షకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతోపాటు సామాన్య ప్రజలు హాజరు కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమ పిలుపునిచ్చారు. విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ అమ్మాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఉమ ఆరోపించారు. రాష్ట్రంలో విలువైన భూములు, ఆస్తుల అమ్మకానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెబుతున్నారు.

ప్రభుత్వ భూముల అమ్మకాన్ని అడ్డుకుంటామని, ఈ నెల 14 చంద్రబాబు నిరాహార దీక్ష తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్, భూముల అమ్మకాలపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఉమ వెల్లడించారు. జగన్ ఇంగ్లీషు మీడియం పై బాద్యతా రాహిత్యంగా మాట్లాడుతున్నారని టిడిపి నేతలంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై సీఎం జగన్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు. తెలుగుదేశం పార్టీలో.. తెలుగు కనిపిస్తోంది కనుక రాష్ట్రంలో తెలుగు లేకుండా చేయాలనే జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తన పదవికి రాజీనామా చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?