ఎన్నికల కమిషనర్ తొల‌గింపుపై చంద్ర‌బాబు ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్సు పై గవర్నర్ కి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ పదవీకాలాన్ని తగ్గిస్తూ చట్టసవరణ, కొత్త కమిషనర్ నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్సుని

ఎన్నికల కమిషనర్ తొల‌గింపుపై చంద్ర‌బాబు ఫైర్

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్సు పై గవర్నర్ కి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు లేఖ రాశారు. ఎన్నికల కమిషన్ పదవీకాలాన్ని తగ్గిస్తూ చట్టసవరణ, కొత్త కమిషనర్ నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్సుని తక్షణం నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ మధ్యలో ఎన్నికల కమిషనర్ ఎలా మారుస్తారని మండిపడ్డారు. 5 ఏళ్ల పదవీకాలానికై 2016 జనవరి 31 న నిమ్మగడ రమేష్ కుమార్ నియమితులయ్యారు. ఆయన పదవీకాలం మధ్యలో ఆర్డినెన్సు ఎలా తెస్తారు. ఆయన పదవీకాలం పూర్తయ్యాకే కొత్త ఆర్డినెన్స్ ని అమలు చేయాలి అని గవర్నర్ కి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా.. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదింపు ఆర్డినెన్సు పై సీపీఐ రామకృష్ణ మండిపడ్డారు. ఆ ఆర్డినెన్స్ తీసుకురావడం కరెక్టు కాదని, కక్షపూరిత చర్యలు, నిరంకుశ విధానాలు తగవని విమర్శించారు. ‘కరోనా’ విపత్తు వల్ల జరిగే ప్రమాదాన్ని ముందుగానే గ్రహించడం వల్లే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎస్ఈసీ వాయిదా వేశారని అన్నారు. ఎస్ఈసీ తమకు అనుకూలంగా లేరని ప్రభుత్వం భావించడం వల్లే ఈ పని చేసిందని, ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామని చెప్పారు.

మరోవైపు.. రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోందని, ఒక బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారని మండలినే రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకువచ్చి ఎస్ఈసీపై కక్ష సాధించారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో జరిగిన అనేక దౌర్జన్యాలకు, అక్రమాలకు ఎన్నికల కమిషన్ స్పందించలేదని, అన్యాయంగా ఏకగ్రీవాలైన సందర్భంలోనూ నోరు మెదపలేదని, మరి ఇన్ని దుర్మార్గాలకు సహకరించిన ఎన్నికల కమిషనర్ పై ఇంతలా ఎందుకు కక్షబూనాడో అర్థం కావడంలేదని అన్నారు. తాజా పరిణామాలపై తాను గవర్నర్ కు లేఖ రాస్తున్నానని కన్నా లక్ష్మీనారాయణ వెల్లడించారు.

Also Read: లాక్డౌన్ ఎఫెక్ట్: పెరిగిన సైబర్ నేరాలు..!

Click on your DTH Provider to Add TV9 Telugu