మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?

ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదికొస్తోంది. ఎన్నికలకు ముందు అప్పటి పాలక, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని పలు దఫాలుగా, వివిధ రకాలు ప్రస్తావించాయి. ఎన్నికలు ముగిసాక వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు. ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర పీఠాన్ని అధిరోహించారు. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమై పార్టీ నేతలను రక్షించుకునే పనిలో పడ్డారు. ఎన్నికలు ముగిసిన దాదాపు 5 నెలలు కావస్తోంది. అటు ప్రతిపక్షంగానీ.. ఇటు అధికార పక్షంగానీ ప్రత్యేక […]

మళ్ళీ తెరపైకి ప్రత్యేక హోదా .. ఈసారి ఎవరంటే ?
Follow us

|

Updated on: Oct 22, 2019 | 6:42 PM

ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరమీదికొస్తోంది. ఎన్నికలకు ముందు అప్పటి పాలక, ప్రతిపక్షాలు ప్రత్యేక హోదా అంశాన్ని పలు దఫాలుగా, వివిధ రకాలు ప్రస్తావించాయి. ఎన్నికలు ముగిసాక వారు వీరయ్యారు.. వీరు వారయ్యారు. ప్రతిపక్ష నేతగా వున్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్ర పీఠాన్ని అధిరోహించారు. అప్పటి ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితమై పార్టీ నేతలను రక్షించుకునే పనిలో పడ్డారు.

ఎన్నికలు ముగిసిన దాదాపు 5 నెలలు కావస్తోంది. అటు ప్రతిపక్షంగానీ.. ఇటు అధికార పక్షంగానీ ప్రత్యేక హోదాపై నోరు మెదపడం లేదు. ప్రత్యేక హోదాపై అప్పట్లో ఊదరగొట్టిన ఓ సినీ నటుడైతే ఇటు అతాపతా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో మొదట్నించి తెలుగు భాష కోసం.. తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఉద్యమాలకు ఊపిరి పోసిన ఏపీ ప్రత్యేక హోదా, విభజన హామీల సాదన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మరోసారి ప్రత్యేక హోదాపై గళం విప్పారు.

ముఖ్య మంత్రి, ప్రతి పక్ష నాయకులు ఎందుకు విభజన హామీలు కోసం పోరాటం చేయడం లేదని చలసాని ప్రశ్నించారు. కేంద్రం పై విరోధం పెట్టుకోమని చెప్పడంలేదు.. కానీ హామీలు అమలు కాకపోతే రూపాయి కూడా ఉత్తరాంధ్ర, రాయలసీమలకు రావన్న అంశాన్ని రాజకీయ నేతలు గుర్తించాలని ఆయనన్నారు. విశాఖలో మంగళవారం నాడు మీడియాతో ఆయన మాట్లాడారు. ఆంధ్రబ్యాంకు లేకుండా చేస్తున్న కేంద్రంపై ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మిగతా రాష్ట్రాల తరహాలో జెఈఈ పరీక్షలు తెలుగులో కూడా రాసే అవకాశమివ్వాలని, ఈ అంశాన్ని వచ్చే పార్లమెంటు సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల ఎంపీలు గట్టి స్వరంతో వినిపించాలని ఆయనంటున్నారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!