Vehicular documents : డ్రైవింగ్ లైసెన్స్​ల గడువు మరోసారి పెంచిన కేంద్ర ప్రభుత్వం..అప్పటివరకు చెల్లుబాటు

కోవిడ్ -19 వ్యాప్తిని నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, పర్మిట్లు మొదలైన....

Vehicular documents  : డ్రైవింగ్ లైసెన్స్​ల గడువు మరోసారి పెంచిన కేంద్ర ప్రభుత్వం..అప్పటివరకు చెల్లుబాటు
Follow us

|

Updated on: Dec 27, 2020 | 5:01 PM

Vehicular documents : కోవిడ్ -19 వ్యాప్తిని నివారించాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, పర్మిట్లు మొదలైన వాహన పత్రాల గడువును 31 మార్చి, 2021 వరకు పొడిగించింది. ఈ విషయంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంత్రిత్వ శాఖ  డైరెక్టరీని విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్ర‌వరి 1తో గ‌డువు ముగిసిన వాహన పత్రాల గ‌డువును వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌రకు పొడిగించారు. ఈ ఏడాది కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో వాటిని పొడిగించుకోలేక‌పోయిన వాహనదారులు కోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.  ఫిబ్ర‌వ‌రి 1తో డాక్యుమెంట్ల గ‌డువు ముగిసినా.. అవి మార్చి 31, 2021 వ‌ర‌కు చెల్లుబాటు అవుతాయ‌ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే తొలుత ఈ ఏడాది డిసెంబ‌ర్ 31 వ‌ర‌కే వీటి గ‌డువు పొడిగించారు. గ‌డువు ముగిసిన వాహన పత్రాల పున‌రుద్ధ‌రణకు అధిక సంఖ్యలో ప్రజలు ర‌వాణా శాఖ కార్యాల‌యాలకు వస్తున్నందున,  కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గ‌డువును మ‌రోసారి పెంచిన‌ట్లు ప్ర‌భుత్వం వివరించింది. 

Also Read : 

Rajinikanth Health Update : ఆల్ క్లియర్.. ఆస్పత్రి నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..ఆనందంలో అభిమానులు

 మెడిసిన్ ఇచ్చి ఆదుకున‌్న భారతం..మన వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల ఆరాటం