‘శ్రీనగర్’కు 100 క౦పెనీల పారామిలటరీ దళాలు

పుల్వామా ఉగ్ర‌దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్లో పుల్వామా సూత్రధారిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కానీ వేర్పాటు వాదనేతలు ప్రజలను రెచ్చగొడుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న యాసిన్‌ మాలిక్‌తో మొదలైన అరెస్టులు పలువురు జమాత్‌ ఇ ఇస్లాం నేతల అరెస్టుల వరకు కొనసాగాయి. కీలక నేత అబ్దుల్‌ హమీద్‌ ఫయాజ్‌ను కూడా నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి దాదాపు 100 కంపెనీల పారామిలటరీ దళాలను […]

'శ్రీనగర్'కు 100 క౦పెనీల పారామిలటరీ దళాలు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:21 PM

పుల్వామా ఉగ్ర‌దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఆందోళనకర పరిస్థితులు తలెత్తాయి. ఆ తర్వాత జరిగిన ఎన్‌కౌంటర్లో పుల్వామా సూత్రధారిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. కానీ వేర్పాటు వాదనేతలు ప్రజలను రెచ్చగొడుతుండటంపై ప్రభుత్వం దృష్టి సారించింది. నిన్న యాసిన్‌ మాలిక్‌తో మొదలైన అరెస్టులు పలువురు జమాత్‌ ఇ ఇస్లాం నేతల అరెస్టుల వరకు కొనసాగాయి. కీలక నేత అబ్దుల్‌ హమీద్‌ ఫయాజ్‌ను కూడా నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి దాదాపు 100 కంపెనీల పారామిలటరీ దళాలను శ్రీనగర్‌కు వాయుమార్గంలో కేంద్ర ప్రభుత్వం తరలించింది. కశ్మీరీలకు ప్రత్యేక హక్కులను కట్టబెట్టే ఆర్టికల్‌ 35‍ఏ పై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 25వ తేదీన కీలక తీర్పును వెలువరించనుంది. పుల్వామా దాడి తర్వాత పలువురు వేర్పాటు వాద నేతలకు భద్రతను ఉపసంహరించుకొన్నారు. వీరిలో యాసిన్‌ మాలిక్‌, సయ్యద్‌ అలీషా గిలానీ, షబ్బీర్‌ షా, సలీం గిలానీ వంటి నేతలు ఉన్నారు.