నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. తుఫాన్ నష్టంపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌

ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నివర్ తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తోంది.

నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన.. తుఫాన్ నష్టంపై జిల్లా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌
Follow us

|

Updated on: Dec 17, 2020 | 9:12 PM

ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన కొనసాగుతుంది. ఇందులో భాగంగా గురువారం నెల్లూరు జిల్లాలో కేంద్ర బృందం పర్యటించింది. నివర్ తుపాను కారణంగా జిల్లాలో జరిగిన నష్టాన్ని కేంద్ర బృందం అంచనా వేస్తోంది. నాయుడుపేట, గూడూరు, కావలిలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన టీమ్.. రైతులతో భేటీ అయ్యి పంట నష్టంపై ఆరా తీసింది.  గూడూరు వద్ద దెబ్బతిన్న బ్రిడ్జిని పరిశీలించిన బృందానికి.. జేసీ హారేంద్ర ప్రసాద్ పరిస్థితిని వివరించారు. అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లావ్యాప్తంగా పంటల, ఆస్తి నష్ట వివరాలతో కూడిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను కలెక్టర్ చక్రధర్ బాబు అధికారులకు వివరించారు. జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్లు, బ్రిడ్జిలు, చెరువులు దెబ్బతిన్నాయని కలెక్టర్ బృందానికి తెలిపారు. నీటమునిగిన వరి పంటల చిత్రాల ప్రదర్శన ద్వారా కేంద్ర బృందానికి వివరించారు. నివర్ తుఫాన్ ముఖ్యంగా రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని కలెక్టర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.