భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది… అయితే.. కండీషన్స్‌ అప్లై అంటున్న సీఐసీ

ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పింది. భర్త గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌ అయితే.. అతని గ్రాస్‌ శాలరీ ఎంతో... ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ ఎంతో ఆర్టీఏ  తో తెలుసుకోవచ్చని సీఐసీ సూచించింది...

భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉంది... అయితే.. కండీషన్స్‌ అప్లై అంటున్న సీఐసీ
Follow us

|

Updated on: Nov 20, 2020 | 10:21 PM

Wife Entitled to Know Husband’s Income : ఇంటికి యజమాని భర్త… ఉద్యోగమో, సజ్జోగమో చేసి సంపాదిస్తాడు కాబట్టి ఇంట్లో అతనిదే పెత్తనం. పురుషాధిక్య ప్రపంచం తీరు ఇది. మీ ఆయన జీతం ఎంత అని ఏ పక్కింటి వదినో అడిగితే.. టక్కున సమాధానం చెప్పలేని ఇబ్బందికర పరిస్థితి ఆ భార్యది. దాదాపు ప్రతీ ఇంట్లో ఇదే దుస్థితి. భర్త జీతం ఎంతో చాలా మంది భార్యామణులకు తెలీదు. అడిగితే అతను చెప్పడు.

నీకెందుకు? అన్నట్టు మాట్లాడే మొగుళ్లే ఎక్కువ మంది. అందుకే, అడగడం దండగన్నట్టు సైలెంట్‌గా ఊరుకుంటుంది భార్య. మీ ఆయన సాలరీ ఎంత అని ఎవరైనా అడిగితే.. ఆ టైమ్‌కి నోటికొచ్చిన ఫిగర్‌ చెప్పేసి ఎలాగోలా మేనేజ్‌ చేసేస్తుంటారు కొందరు భార్యామణులు.

ఇకపై అలాంటి ఇబ్బందులు అవసరం లేదు. భర్త జీతం ఎంతో తెలుసుకునే హక్కు భార్యకు ఉందంటూ సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ తేల్చి చెప్పింది. భార్య అంటే భరించేది మాత్రమే కాదని.. భర్త సాలరీ ఎంతో తెలుసుకునే రైట్స్‌ ఆమెకు పూర్తిగా ఉన్నాయని తేల్చి చెప్పింది.

అయితే.. కండీషన్స్‌ అప్లై అంటూ చిన్న తిరకాసు పెట్టింది. ఈ రూల్‌ కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్పింది. భర్త గవర్నమెంట్‌ ఎంప్లాయ్‌ అయితే.. అతని గ్రాస్‌ శాలరీ ఎంతో… ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌ ఎంతో ఆర్టీఏ  తో తెలుసుకోవచ్చని సీఐసీ సూచించింది. అయితే ఆర్టీఏ ద్వారా అప్లై చేసిన 15 రోజుల్లోగా ఆ వివరాలు భార్యకు ఇవ్వాలని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ను ఆదేశించింది.

జోథ్‌పుర్‌కు చెందిన రహ్మత్‌ బానో వేసిన అప్పీల్‌ మేరకు సెంట్రల్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషన్‌ ఈ ఆదేశాలు జారీ చేసింది. తన భర్త సాలరీ డిటైల్స్‌ చెప్పాలంటూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జోథ్‌పుర్‌ను ఆర్టీఏ  ద్వారా రహ్మత్‌ బానో అడిగింది . అయితే.. థార్డ్‌ పర్సన్‌కు ఆ వివరాలు ఇవ్వలేమంటూ అటు నుంచి రిప్లై వచ్చింది. దీంతో సీఐసీకు అప్పీల్‌కు వెళ్లగా.. భర్త సాలరీ వివరాలు భార్యకు చెప్పాల్సిందేంటూ ఆదేశించింది హయ్యర్‌ అథారిటీ.

గతంలోనూ ప్రభుత్వ ఉద్యోగి జీతం తెలుసుకునే హక్కు భార్యకు ఉందంటూ పలుమార్లు ఉత్తర్వులు ఇచ్చింది సీఐసీ. ఇకపై.. గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌గా ఉన్న భర్తలకి.. మగాడి జీతం అడగొద్దు అనే డైలాగ్‌ అప్లై అవదు. అయితే.. ప్రైవేట్‌ ఉద్యోగులు మాత్రం ఈ రూల్‌ వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగే మగాడి జీతం అడగొద్దంటూ కటింగ్‌ ఇవ్వొచ్చన్నమాట.