పోలవరం వార్.. జగన్ వర్సెస్ కేంద్రం!

పోలవరం వార్.. జగన్ వర్సెస్ కేంద్రం!

పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్రం మరోసారి లేఖ రాసింది. రెండు వారాల క్రితం పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రెండు రోజుల్లోగా ఈ లేఖపై తగిన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా తాజాగా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలపై నివేదిక పంపాలంటూ రెండు వారాల క్రితం ప్రధాన మంత్రి […]

Ram Naramaneni

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2019 | 10:22 AM

పోలవరం ప్రాజెక్టు టెండర్ల విషయంలో జగన్ సర్కార్‌కు కేంద్రం మరోసారి లేఖ రాసింది. రెండు వారాల క్రితం పీఎవోం రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోవడంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ సీరియస్‌గా తీసుకుంది. రెండు రోజుల్లోగా ఈ లేఖపై తగిన సమాధానం ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఓపీ సిన్హా తాజాగా లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్ట్ పరిణామాలపై నివేదిక పంపాలంటూ రెండు వారాల క్రితం ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) జగన్ సర్కార్‌కు లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించ లేదు. రివర్స్‌ టెండరింగ్‌పై ప్రాజెక్ట్ అథారిటీ విముఖత ప్రదర్శించినా.. ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లడంతో కేంద్రం వివరణ కోరింది. ఈ నిర్ణయం వెనుక కారణంపై నివేదిక కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి పీఎంవో లేఖ రాసింది.

ఏపీలో అక్రమాలు జరిగిన భారీ ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ ను అమలు చేయాలన్న జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తూచ తప్పకుండా అమలు చేసుకుంటూ వెళ్తోంది. పోలవరం జాతీయ ప్రాజెక్టు నుంచే దీన్ని అమలు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. 55,548 కోట్ల రూపాయలు వ్యయం కానుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో టీడీపీ ప్రభుత్వ హయాంలో దాాదాపు 3,797 కోట్ల అక్రమాలు జరిగినట్లు నిపుణుల కమిటీ ప్రభుత్వానికి  ఇన్నర్‌గా నివేదించింది. కానీ వాటి సంబంధించిన వివరాలను ప్రభుత్వం బయటకు ప్రకటించలేదు.

ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టులు అయితే తీసుకున్నారు కానీ పనులు మాత్రం ఆశించినంత మేర పూర్తి చేయలేకపోయారని, చాలా పనుల్లో మొబలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని మరీ పనులు చేయకుండా తీవ్ర జాప్యం చేశారని, దీనిపై గత టీడీపీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదించినట్లు సమాచారం. వాస్తవాననికి ప్రాజెక్ట నిర్మాణ పనుల కాంట్రాక్టులు దక్కించుకన్న ఏజెన్సీలు 24 నెలల్లో తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఒప్పందం ముగిసినా వారు పనులు పూర్తి చేయలేకపోయారని తెలిసింది. అదే సమయంలో పెరిగిన ధరలకు అనుగుణంగా తమకు చెల్లింపులను కూడా పెంచాలని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయని నివేదిక సదరు కంపెనీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

దీంతో ఏపీ రివర్స్ టెండరింగ్ అంటూ పట్టుబడుతుండటంతో కేంద్రం సీరియస్ అవుతోంది. ఆ పద్దతి కరెక్ట్ కాదంటూ ఇప్పటికే కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి ఒకట్రెండు సార్లు లేఖలు అందాయి. అయితే తాజాగా పోలవరంపై ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జలశక్తి శాఖ మరో లేఖ రాసింది. పోలవరంలో అక్రమాలు జరిగాయని నిపుణుల కమిటీ తేల్చింది. అయితే నిపుణుల కమిటీ నివేదికతో విభేదిస్తూ అక్రమాలు జరగలేదని పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ కమిటీ తేల్చినట్టు వార్తలు వెలువడ్డాయి. నివేదిక, పీపీఏ రిపోర్ట్‌ మధ్య తేడాలు ఎందుకు ఉన్నాయో రెండ్రోజుల్లో సమాధానం చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. పీపీఏలపై కేంద్ర ప్రభుత్వం సోమవారం నాడు తీవ్ర విమర్శలు చేసింది. పవర్ ప్రాజెక్టులపై సీఎం జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ధ్వజమెత్తారు. సరైన ఆధారాలుంటే విద్యుత్ రంగంలో పెట్టుబడులు వస్తాయని, తాము చెప్పినా జగన్ వినడం లేదని అసహనం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన వంద రోజుల ప్రగతిపై ఆయన ఓ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాబు హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని, దీనివల్ల పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu