ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ‘వై‘ కేటగిరీ భద్రత

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ‘వై‘ కేటగిరీ భద్రత

గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందిం. తనకు నియోజకవర్గంలో పర్యటించడానికి భద్రత పెంచాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి విన్నవించుకున్న నేపథ్యంలో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకు ‘వై‘ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.

Balaraju Goud

|

Aug 07, 2020 | 2:09 PM

గత కొంతకాలంగా సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కొంటున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పిస్తూ నిర్ణయం తీసుకుందిం. తనకు నియోజకవర్గంలో పర్యటించడానికి భద్రత పెంచాలంటూ కేంద్ర హోం శాఖ మంత్రికి విన్నవించుకున్న నేపథ్యంలో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో భద్రత కల్పించాలని నిర్ణయించింది. ఆయనకు ‘వై‘ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖ సీఆర్‌పీఎఫ్‌ డీజీకి ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల నుంచి తన ప్రాణానికి ముప్పుందని.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనపై కేసులు పెట్టారు. పార్టీ అంతర్గ విబేధాలు బహిరంగంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లాయి. కనీసం తనను గెలిపించిన నియోజకవర్గంలో పర్యటించేందుకు వీలు లేకుండా సొంత పార్టీ వారే అటంకం సృష్టిన్తున్నారని గతంలోనే రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. దీంతో రాష్ట్ర పోలీసుల రక్షణపై తనకు విశ్వాసం లేదని.. ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విన్నవించుకున్నారు. అటు, తనకు భద్రత పెంచాలంటూ ఢిల్లీ హైకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు వేశారు రఘురామకృష్ణంరాజు. ః ప్రస్తుతం తనకు రాష్ట్ర పోలీసులతో 1+1 భద్రత ఉన్నదని, ఇది కాకుండా అదనంగా కేంద్ర బలగాలతో వ్యక్తిగత రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో కేంద్రం 11 మంది సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో వై కేటగిరీ (3+3+3+2) రక్షణ కల్పించింది. 9 మంది జవాన్లు ముగ్గురేసి చొప్పున మూడు షిఫ్టుల్లో భద్రత కల్పించనున్నారు. కమాండో శిక్షణ ఉన్న ఇద్దరు గన్‌మెన్‌ కూడా అదనంగా ఉండనున్నారు. రఘురామరాజు ఎప్పుడు బయటకు వెళ్లినా ముగ్గురు సిబ్బందితో పాటు ఓ కమాండో కూడా ఆయన వెంట భద్రతగా నిలుస్తారు. కేంద్రం తనకు సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పించినందున దన్యవాదాలు తెలిపిన రఘురామకృష్ణంరాజు.. త్వరలో తన నియోజకవర్గం నరసాపురంతో పర్యటిస్తానని తెలిపారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రకటించిన ఆయన ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu