ఇకపై విమానాల్లో స్నాక్స్, మీల్స్‌కు అనుమతిః కేంద్రం

విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇక నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో మీల్స్‌కు అనుమతులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇకపై విమానాల్లో స్నాక్స్, మీల్స్‌కు అనుమతిః కేంద్రం
Follow us

|

Updated on: Aug 29, 2020 | 1:41 AM

Airlines Can Provide Meals: విమాన ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇక నుంచి దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో మీల్స్‌కు అనుమతులు ఇస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశీయ విమానాల్లో ప్రయాణించేవారికి ప్రీ-ప్యాక్డ్ స్నాక్స్, మీల్స్, పానీయాలు సర్వ్ చేసేందుకు ఆమోదం తెలపగా.. అంతర్జాతీయ ప్రయాణీకులకు వేడి వేడి భోజనాలు, పరిమితంగా డ్రింకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా సీట్ ఇన్-ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్‌కు ఓకే చెప్పిన సర్కార్.. ప్రయాణీకులు విమానం ఎక్కే ముందే వాటిని శుభ్రంగా క్లీన్ చేయాలంది. అటు ప్యాసింజర్లకు డిస్‌ఇన్‌ఫెక్ట్‌డ్‌ హెడ్ ఫోన్స్ ఇవ్వాలని తెలిపింది. అంతేకాకుండా విమానాల్లో మాస్క్ ధరించడానికి నిరాకరించే వారిని విమానయాన సంస్థలు నో ఫ్లై జాబితాలో చేర్చవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు మార్పులు చేస్తూ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్స్(ఎస్ఓపీ)లు విడుదల చేసింది. (కరోనా చికిత్స.. ఆ రెండు టాబ్లెట్స్ కలిపి వాడితే ముప్పే..!)

బిజినెస్, ఎకానమీ క్లాస్ ఏదైనా కూడా టీ, డ్రింక్స్, ఆల్కహాల్ అన్నింటిని కూడా డిస్పోజబుల్ గ్లాసెస్, బాటిల్స్, క్యాన్స్‌లోనే ప్రయాణీకులకు సర్వ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా విమాన సిబ్బంది మీల్స్‌ లేదా స్నాక్స్‌ సర్వ్ చేసే ప్రతీసారి గ్లౌజులు మార్చాలంది. కాగా, విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద కేంద్రం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతోంది. త్వరలోనే పూర్తి స్థాయి విమాన సర్వీసులు పునరుద్ధరణ చేసేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?