తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే లక్ష్యంగా సాగుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో రెండో రోజు ప్రధాన మంత్రి నరేంద్ర..

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే లక్ష్యంగా సాగుతోన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనలో రెండో రోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. రాత్రి గం. 7.00 సమయంలో ప్రధానితో సమావేశమైన కేసీఆర్, దాదాపు 40 నిమిషాల పాటు చర్చించారు. 2019 అక్టోబర్ 4న ప్రధానితో సమావేశమైన కేసీఆర్, మళ్లీ 14 నెలల తర్వాత ఆయన్ను కలిశారు. అయితే అప్పటికి రాజకీయంగా ప్రత్యర్థులే అయినా చెప్పుకోదగ్గ వైరాన్ని ప్రదర్శించని నేతలిద్దరూ, తాజాగా తెలంగాణలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజకీయంగా తీవ్రస్థాయిలో తలపడ్డారు. ఆ తర్వాత జరిగిన భేటీ కావడంతో రాజకీయవర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. రెండ్రోజుల నుంచి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న సీఎం కేసీఆర్, రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర నిధులు, ప్రాజెక్టులపైనే ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. వచ్చీ రావడంతోనే కేంద్ర జలశక్తి మంత్రితో సమావేశమై, కొత్త ప్రాజెక్టులు, వాటి నిర్మాణానికి అడ్డంకిగా మారుతున్న అంతర్రాష్ట్ర జలవివాదాల గురించి మాట్లాడారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసి హోంశాఖ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన వరద సహాయం సహా శాఖాపరమైన అనేకాంశాల గురించి చర్చించారు. శనివారం మధ్యాహ్నం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమై తెలంగాణ రాష్ట్రంలో 6 కొత్త విమానాశ్రయాల ఏర్పాటు గురించి చర్చించారు.