గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ కేసు

గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసుల‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగంపై సీబీఐ మంగళవారం ఈ కేసు ఫైల్ చేసింది.

గుంటూరు సీసీఎస్‌ పోలీసులపై సీబీఐ కేసు
Follow us

|

Updated on: Aug 12, 2020 | 10:25 AM

CBI Case On Guntur CCS Police : గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ పోలీసుల‌పై సీబీఐ కేసు న‌మోదు చేసింది. ముగ్గురు వ్యక్తులను అక్రమంగా 10 రోజుల పాటు నిర్బంధించారనే అభియోగంపై సీబీఐ మంగళవారం ఈ కేసు ఫైల్ చేసింది. గుంటూరు సీసీఎస్ పీఎస్‌ ‌ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.వెంకటరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ సాంబశివరావు, కానిస్టేబుల్‌ వీరాంజనేయులుతో పాటు ఆ స్టేషన్‌కు సంబంధించిన మ‌రికొంద‌రు గుర్తు తెలియ‌ని అధికారులను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా చేర్చింది. ఐపీసీ 120 బీ, 344, 348 సెక్షన్ల కింద వారిపై అభియోగాలు నమోద‌య్యాయి.

గుంటూరు జిల్లాకు చెందిన రాయిడి శ్రీనివాసరావు, నలబోలు ఆదినారాయణ, తూమటి శ్రీనివాసరావులను 2019 అక్టోబరులో గుంటూరు సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించిన ఉన్న‌త న్యాయస్థానం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల‌ని సీబీఐని ఆదేశించింది. విచారణ చేపట్టిన అధికారులు మంగళవారం కేసు ఫైల్ చేశారు. ఢిల్లీ బ్రాంచ్ ఎస్పీ ఎం.ఎస్‌.ఖాన్‌ కేసు ఎఫ్‌ఐఆర్‌ జారీ చేశారు.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”