Gold Missing: 103 కేజీల బంగారం మాయం.. వివరణ ఇచ్చిన సీబీఐ.. అసలేం జరిగిందంటే…

చైన్నైలోని సీబీఐ కార్యాలయంలో కస్టడీలో ఉండాల్సిన 103 కిలోల బంగారం మాయం అవడంపై సీబీఐ వివరణ ఇచ్చింది.

Gold Missing: 103 కేజీల బంగారం మాయం.. వివరణ ఇచ్చిన సీబీఐ.. అసలేం జరిగిందంటే...
Shiva Prajapati

|

Dec 16, 2020 | 1:13 PM

Gold Missing: చైన్నైలోని సీబీఐ కార్యాలయంలో కస్టడీలో ఉండాల్సిన 103 కిలోల బంగారం మాయం అవడంపై సీబీఐ వివరణ ఇచ్చింది. కస్టడీలో ఉన్న 103 కేజీల బంగారం మాయమైన విషయం వాస్తవమే అంది. అయితే ఆ బంగారం తమ సీబీఐ సేఫ్టీ లాకర్ల నుంచి మాయం కాలేదని ప్రకటించింది. అప్పట్లో సురానా కంపెనీ నుంచి 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పిన సీబీఐ.. ఆ బంగారాన్ని సురానా కంపెనీకి చెందిన లాకర్లలోనే ఆ కంపెనీ ఎండీ సమక్షంలోనే భద్రపరిచామని చెప్పుకొచ్చింది. ఆ కార్యక్రమం అంతా అధికారుల సమక్షంలో జరిగిందని సీబీఐ అధికారులు చెప్పారు. అయితే తాజాగా హైకోర్టు ఆదేశాల ప్రకారం, అధికారిక లిక్విడేటర్, ఆరు బ్యాంకులు, స్వతంత్ర సాక్షుల సమక్షంలో తిరిగి లాకర్లను ఓపెన్ చేయగా 103 కేజీల బంగారం కనిపించలేదన్నారు. బంగారంపై అతికించిన ముద్రలు మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి కానీ, లోపలి బంగారం మాత్రం మాయమైందని పేర్కొన్నారు. బంగారం మాయం కేసులో సీబీఐ అధికారుల ప్రమేయంపై అంతర్గత విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. ఈ విచారణలో సీబీఐ అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. దీనిపై రాష్ట్ర సీబీ-సీఐడీ కేసు నమోదు చేసిందని, ఎస్పీ ర్యాంక్ ఉన్న అధికారి ఈ దర్యాప్తును చేస్తారని సీబీఐ ఉన్నతాధికారులు తెలిపారు.

Also read:

నేడు విజయ దివాస్.. పాక్‌పై భారత్ ఘన విజయం.. 93వేల మంది పాక్ సైనికులు శరణు కోరిన వేళ..

Weather Report: తెలంగాణలో చలిపులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. వణుకుతున్న ప్రజలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu