చెలరేగిన మోర్గాన్..రాజస్థాన్‌ టార్గెట్ 192

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(68 నాటౌట్: 35 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) విరుచుకుపడ్డాడు.

చెలరేగిన మోర్గాన్..రాజస్థాన్‌ టార్గెట్ 192
Follow us

|

Updated on: Nov 01, 2020 | 9:43 PM

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(68 నాటౌట్: 35 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. దీంతో రాజస్థాన్‌కు కోల్‌కతా 192 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది. తొలి ఓవర్‌లోనే రాణాను ఆర్చర్‌ డకౌట్‌ చేసి కోల్‌కతాకు ఝలక్‌ ఇచ్చాడు. అయితే శుభ్‌మన్ గిల్‌ (36; 24 బంతుల్లో, 6×4)తో కలిసి రాహుల్‌ త్రిపాఠి (39; 34 బంతుల్లో, 4×4,2×6) ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించారు.  కాగా, 9వ ఓవర్‌ వేసిన రాహుల్ తెవాతియా గిల్‌, నరైన్‌ (0)ను ఔట్‌ చేసి కోల్‌కతాను కలవరపెట్టాడు. కొద్దిసేపటికే త్రిపాఠి, కార్తీక్‌ (0) కూడా ఔటవ్వడంతో కోల్‌కతా 99 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.

ఈ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన రసెల్‌ (25; 11 బంతుల్లో; 1×4, 3×6)తో కలిసి మోర్గాన్‌ రాజస్థాన్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. శ్రేయస్‌ గోపాల్‌ వేసిన 14వ ఓవర్‌లో మోర్గాన్ రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 21 పరుగులు సాధించాడు. ఈ క్రమంలోనే జోరు పెంచుతోన్నరసెల్‌ను త్యాగి ఔట్‌ చేసి కోల్‌కతాను మరోసారి ఒత్తిడిలోకి నెట్టాడు. కానీ కమిన్స్‌తో కలిసి మోర్గాన్‌ ఆఖర్లో చెలరేగిపోయాడు. స్టోక్స్‌ వేసిన 19వ ఓవర్‌లో సిక్సర్లతో చెలరేగడంతో 24 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో 30 బంతుల్లో అతడు హాఫ్ సెంచరీ  చేశాడు.

Also Read  : అతడు బౌలింగ్ వేస్తే..విరాట్ పెవిలియన్‌కే