Cannabis: విశాఖలో 1638 కిలోల గంజాయి పట్టివేత

Cannabis: విశాఖలో రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1638 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిందని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ (డీఆర్ఐ) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటిలిజెన్స్ సమాచారం ఆధారంగా విశాఖపట్నం పోలీసులు బుధవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.మొత్తం 40 సంచుల్లో 800 బ్రౌన్ ప్యాకెట్లలో గంజాయిని పట్టుకున్నారు. అరటి గెలల మధ్యన ఈ గంజాయి సంచులు దాచారని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ గంజాయి […]

Cannabis: విశాఖలో 1638 కిలోల గంజాయి పట్టివేత
Follow us

| Edited By:

Updated on: Feb 27, 2020 | 8:01 PM

Cannabis: విశాఖలో రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 1638 కిలోల నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల ప్రత్యేక ఆపరేషన్‌లో పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడిందని డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటలీజెన్స్ (డీఆర్ఐ) ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటిలిజెన్స్ సమాచారం ఆధారంగా విశాఖపట్నం పోలీసులు బుధవారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.మొత్తం 40 సంచుల్లో 800 బ్రౌన్ ప్యాకెట్లలో గంజాయిని పట్టుకున్నారు. అరటి గెలల మధ్యన ఈ గంజాయి సంచులు దాచారని పోలీసులు తెలిపారు.

కాగా.. ఈ గంజాయి విశాఖ ఏజెన్సీ నుంచి భువనేశ్వర్ తరలిస్తున్న పోలీసులు పేర్కొన్నారు. గంజాయి తరలిస్తున్న వారిపై 11985 చట్టం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 1638 కిలోల ఈ గంజాయి విలువ 2.45 కోట్ల రూపాయలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గంజాయిని తరలిస్తున్న రెండు వాహనాల్ని సైతం సీజ్ చేశారు.