బీజేపీ కార్యాలయంలో నాయకుల తన్నులాట.. బీ ఫామ్‌ కోసం కమలంలో కుమ్ములాట..

నామినేషన్ల పర్వం ముగిసింది.. అయినా బీజేపీలో టికెట్ల లొల్లి మాత్రం ఆగలేదు. గన్‌ఫౌండ్రీ టికెట్‌ను టీడీపీ నుంచి వచ్చిన ఓం ప్రకాష్‌ సతీమణి డా.సురేఖకు కేటాయించారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడిన స్థానిక...

బీజేపీ కార్యాలయంలో నాయకుల తన్నులాట.. బీ ఫామ్‌ కోసం కమలంలో కుమ్ములాట..

నామినేషన్ల పర్వం ముగిసింది.. అయినా బీజేపీలో టికెట్ల లొల్లి మాత్రం ఆగలేదు. గన్‌ఫౌండ్రీ టికెట్‌ను టీడీపీ నుంచి వచ్చిన ఓం ప్రకాష్‌ సతీమణి డా.సురేఖకు కేటాయించారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడిన స్థానిక బీజేపీ నేత శైలేంద్ర యాదవ్‌ వర్గం భగ్గుమంది. బీజేపీ కార్యాలయంకు వచ్చి ఆందోళనకు దిగింది.

అదే సమయంలో ఓంప్రకాష్ తన భార్యతో కలిసి బీ ఫారం కోసం బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో టికెట్‌ ఆశించి భంగపడిన బీజేపీ స్థానిక నేత శైలేందర్‌ వర్గీయులు ఓం ప్రకాష్‌పై పిడిగుద్దులు కురుపించారు. ఆయన చొక్కా చించేశారు. ఈ సమయంలో ఓంప్రకాశ్‌, శైలేంద్ర వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌.. బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారంటూ శైలేంద్ర అనుచరులు నినాదాలు చేశారు.

క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీకి పేరుంది. అయితే.. గ్రేటర్‌లో టికెట్ల చిచ్చు ఓ రేంజ్‌లోనే ఉండటంతో ఆ పార్టీకి కూడా తిప్పలు తప్పడం లేదు. మొన్న కూకట్‌పల్లిలో కొట్టుకున్నారు. పార్టీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. నిన్న కుత్బుల్లాపూర్‌లో అలాగే జరిగింది. టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. ఆఫీస్‌లో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.