పొంచి ఉన్న ప్రమాదం.. ప్రతీ పదిమందిలో ఒకరికి క్యాన్సర్.?

Cancer In India: ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్రమేపి శరీరంలోని కణాలన్నింటిని నాశనం చేస్తూ ఈ వ్యాధి చావుకు దగ్గర చేస్తుంది. దీన్ని నయం చేయడానికి ఎన్ని దారులు ఉన్నా కూడా ఇది అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( నిర్వహించిన ఒక సర్వేలో ఈ మహమ్మారి గురించి ఉలిక్కిపడే వాస్తవాలు ఎన్నో బయటికి వచ్చాయి. మునపటి కంటే ఎక్కువగానే క్యాన్సర్ భారతదేశంలో విస్తరిస్తోందని ఈ నివేదిక చెబుతోంది. ప్రతీ […]

పొంచి ఉన్న ప్రమాదం.. ప్రతీ పదిమందిలో ఒకరికి క్యాన్సర్.?

Cancer In India: ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్రమేపి శరీరంలోని కణాలన్నింటిని నాశనం చేస్తూ ఈ వ్యాధి చావుకు దగ్గర చేస్తుంది. దీన్ని నయం చేయడానికి ఎన్ని దారులు ఉన్నా కూడా ఇది అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. ఇక తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ( నిర్వహించిన ఒక సర్వేలో ఈ మహమ్మారి గురించి ఉలిక్కిపడే వాస్తవాలు ఎన్నో బయటికి వచ్చాయి.

మునపటి కంటే ఎక్కువగానే క్యాన్సర్ భారతదేశంలో విస్తరిస్తోందని ఈ నివేదిక చెబుతోంది. ప్రతీ 10 మంది భారతీయుల్లో ఒకరు ఈ వ్యాధి బారిన పడుతున్నారని.. అంతేకాక 15 మందిలో ఒకరు దీని వల్ల చనిపోతున్నారని తేలింది. ఇక ఈ లెక్కలు భారతదేశంలోని అంతర్గత నివేదికల కంటే అధికంగా ఉండటం గమనార్హం.

దేశ ప్రజల్లో ఎక్కువ మందికి రొమ్ము, గొంతు, గర్భాశయ కేన్సర్లు వస్తున్నాయని.. అధిక బరువు, మారుతున్న ఆహారపు అలవాట్లు ఇంకా మరెన్నో కారణాల వల్ల క్యాన్సర్ వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. మిజోరాం రాష్ట్రంలో అధికంగా ఐదుగురిలో ఒకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుండగా.. మహారాష్ట్రలో చాలా తక్కువగా 22 మంది మగవారిలో ఒకరికి.. అలాగే 18 మంది ఆడవారిలో ఒకరు ఈ క్యాన్సర్ బారిన పడుతున్నట్లు రిపోర్ట్ చెబుతోంది.

అలాగే 2018లో సుమారు 1.16 మిలియన్ క్యాన్సర్ కేసులు కొత్తగా నమోదయ్యాయని తెలుస్తోంది. ఇక పొగాకు సంబంధిత ఉత్పత్తులు ఎక్కువగా తీసుకుంటే ఈ ప్రాణాంతక వ్యాధిని కంట్రోల్ చేయడం సాధ్యపడదని వైద్య నిపుణులు అంటున్నారు. కాగా, ప్రజలు ఈ డేంజర్‌ను గుర్తించి తగిన చర్యలు తీసుకుని సురక్షితంగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

Published On - 6:12 pm, Wed, 5 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu