రష్యా వ్యాక్సిన్ సామర్థ్యంపై పలు సందేహాలు..? కెనడా కూడా..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నామంటూ రష్యా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచదేశాలు సందేహాలను

రష్యా వ్యాక్సిన్ సామర్థ్యంపై పలు సందేహాలు..? కెనడా కూడా..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 6:58 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్‌ను విడుదల చేస్తున్నామంటూ రష్యా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ వ్యాక్సిన్‌పై ప్రపంచదేశాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. ‘స్పుత్నిక్‌-వి’ పేరుతో వ్యాక్సిన్ సిద్ధమైందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మంగళవారం ప్రకటించారు. కరోనాకు టీకా అభివృద్ధి చేసిన మొదటి దేశంగా రష్యా నిలిచిందన్నారు. ఈ టీకా వేయించుకుంటే రెండేళ్లపాటు కొవిడ్‌ నుంచి రక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. సెప్టెంబరులో ఈ వ్యాక్సిన్‌ ఉత్పత్తిని భారీస్థాయిలో ప్రారంభించి.. అక్టోబరు నుంచి ప్రజలకు ఇవ్వనున్నట్టు రష్యా అధికారులు చెప్పారు.

కాగా.. కరోనా కట్టడికోసం ఆఘమేఘాల మీద తయారైన రష్యా వ్యాక్సిన్ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా అనేక మంది శాస్త్రజ్ఞులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా వ్యాక్సిన్‌ను ప్రస్తుతానికి తాము అప్రూవ్ చేయడం లేదని కెనడా ప్రభుత్వం వెల్లడించింది. వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచార లోపం కారణంగానే తాము అప్రూవ్ చేయడం లేదని కెనడా డిప్యూటీ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ హోవార్డ్ జో మంగళవారం వెల్లడించారు. రష్యాలో వ్యాక్సిన్‌కు వెంటనే ఆప్రూవల్ రావడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని హోవార్డ్ అన్నారు.

Read More:

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!