ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మేల్ నర్సు, వారంలోనే రియాక్షన్, కోవిడ్ 19 పాజిటివ్, కాలిఫోర్నియాలో మొదటి కేసు నమోదు,

కాలిఫోర్నియాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మేల్ (మగ) నర్సు వారం దాటగానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోవిడ్ 19 పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు.

  • Umakanth Rao
  • Publish Date - 5:00 pm, Wed, 30 December 20
ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న మేల్ నర్సు, వారంలోనే రియాక్షన్, కోవిడ్ 19 పాజిటివ్, కాలిఫోర్నియాలో మొదటి కేసు నమోదు,

కాలిఫోర్నియాలో ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఓ మేల్ (మగ) నర్సు వారం దాటగానే తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కోవిడ్ 19 పాజిటివ్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. మ్యాథ్యూ అనే ఇతడు రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో పని చేస్తున్నాడు. ఫైజర్ టీకామందు తీసుకున్న అనంతరం మొదట తన మోచెయ్యి ఉబ్బిందని, కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కలగలేదని ఆయన తెలిపాడు. అయితే ఆరు రోజుల తర్వాత..క్రిస్మస్ రోజున కోవిడ్ యూనిట్ లో పని చేసిన తనకు కండరాల నొప్పులు, అలసట ఎక్కువయ్యాయని, పని చేయలేకపోయానని వెల్లడించాడు. టెస్ట్ చేయించుకోగా కోవిడ్ 19 పాజిటివ్ అని రిపోర్టు వచ్చిందన్నాడు.అయితే ఇది ముందుగా ఊహించిందేనని శాన్ డీగోలోని అంటువ్యాధుల నివారణ నిపుణుడు క్రిస్టియన్ రేమర్స్ పేర్కొన్నారు. ఫైజర్ టీకామందు తీసుకున్న అనంతరం క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను చూస్తే..వ్యాక్సిన్ నుంచి రక్షణకు 10 నుంచి 14 రోజులు పడుతుందని ఆయన చెప్పారు.

ఫస్ట్ డోస్ లో సుమారు 50 శాతం, రెండో డోసులో 95 శాతం స్వస్థత కలుగుతుందని వివరించారు. మ్యాథ్యూ కేసులో ఆందోళన చెందాల్సిన పని లేదని రెమర్స్ అన్నారు. కాగా ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు హెల్త్ కేర్ వర్కర్లు కూడా అలెర్జీతో బాధ పడినట్టు వార్తలు రావడంతో మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ.. జాతీయ ఆరోగ్య సంస్థకు ప్రికాషనరీ అడ్వైజ్ జారీ చేసింది. అలెర్జీలు ఉన్నవారు ఈ టీకామందు తీసుకోకపోవడమే ఉత్తమమని యూకే లోని రెగ్యులేటరీ ఇదివరకే హెచ్ఛరించింది.