Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు…

బంగారం కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా... అయితే మీకు ఒక విషయం తెలుసుకోవాలి. ఈసారి జువెలరీ షాపుకు వెళ్లేటప్పుడు వెంట మీ కేవైసీ తీసుకెళ్లడం మాత్రం మరిచిపోవద్దు. పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటివి తీసుకువెళ్లండి.

Buy Gold Jewellery : బంగారం కొనేందుకు వెళ్తున్నారా..? అయితే ఈ డాక్యుమెంట్స్ మరిచిపోవద్దు...
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 06, 2021 | 3:44 PM

భారతీయులకు బంగారానికి విడదీయరాని అనుబంధం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారాన్ని ఎక్కువగా వినియోగించే దేశాల జాబితాలో భారత్‌ ముందువరసలో ఉంటుంది. సాధారణంగా బంగారాన్ని ఆభరణాలు , నాణేలు, బంగారపు కడ్డీల రూపంలో దాచుకుంటారు. అంతే కాదు ఇప్పుడు పెట్టుబడి మార్గంగానూ దీన్ని ఎంచుకుంటున్నారు. ఆభరణాల తయారీలో చోటుచేసుకుంటున్న మార్పులు, భారీగా పెరుగుతున్న కొనుగోలు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

అంతేకాదు ప్రత్యేకించి సంక్రాంతి సమయంలో బంగారం కొనుగోలుకు భారతీయులు.. అందులోనూ తెలుగువారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మీరు బంగారం కొనేందుకు వెళ్తున్న సమయంలో ఓ విషయాన్ని గుర్తుంచుకోండి. మీ వెంట కొన్ని డాక్యుమెంట్లు తప్పకుండా తీసుకెళ్లండి. అందులో పాన్ కార్డు, ఆధార్ కార్డు వంటి ప్రభుత్వం గుర్తించిన కొన్ని పత్రాలు తప్పకుండా తీసుకెళ్లడం మరిచిపోవద్దు.

బంగారం కొనేందుకు కావల్సింది క్యాష్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవి కదా కావల్సింది.. వీటితో పనేటి అని అనుకుంటున్నారా.. మీరు చాలా విషయాలు తెలుసుకోవాలి.. ఎందుకంటే.. ఇక ముందు జూవెలరీ షాపుల వారు బంగారం కొనుగోలుదారుల నుంచి కేవైసీ డాక్యుమెంట్స్ అడుగనున్నారు. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో క్యాష్ రూపంలో బంగారం కొనుగోలుకు కేవైసీ డాక్యుమెంట్లను తప్పనిసరి చేసే అవకాశముందని జువెలర్లు భావిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేంద్ర ప్రభుత్వం జూవెలరీ రంగానికి మనీ ల్యాండరింగ్ చట్టాన్ని వర్తింపజేసిన దగ్గరి నుంచి జూవెలర్లు ఆందోళనలో ఉన్నారు. ఏమైనా అనుమానిత లావాదేవీలు కనిపిస్తే ప్రభుత్వ ఏజెన్సీల వల్ల ఇబ్బందులు రావొచ్చని వారు భావిస్తున్నారు. ప్రస్తుతం బంగారం మినహాయించి ఇతర వాటిల్లో డబ్బులు పెట్టాలన్నా లేదంటే కొనాలని కేవైసీ డాక్యుమెంట్లు తప్పనిసరి. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారానికి కూడా ఈ రూల్‌ను వర్తింపజేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. అందుకే జువెలరీ సంస్థలు ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నాయి.

ఇకపోతే జూవెలరీ సంస్థలు ప్రతి లావాదేవీని ప్రభుత్వ ఏజెన్సీలకు తెలియజేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏమైనా అవకతవకలు ఉంటే అప్పుడు ఏజెన్సీలు జువెలరీ ప్రతినిధులను అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అందు జూవెలరీ సంస్థలు రూ.2 లక్షలలోపు కొనుగోళ్లకు కూడా కేవైసీ డాక్యుమెంట్లు కోరుతున్నారు. అయితే కొనుగోలుదారుల్లో మాత్రం ఈ అంశంపై గందరగోళం తలెత్తింది.

ఇవి కూడా చదవండి :

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..