నల్లమల్లలో కార్చిచ్చు.. తగలబడుతోన్న అడవి

నల్లమల్ల అడవిలో కార్చిచ్చు చెలరేగింది.. దీంతో అడవి తగలబడుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే నల్లమల్ల అడవిలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరన్నా కావాలని అంటించారా? లేక ఎండలకు ఇలా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. […]

నల్లమల్లలో కార్చిచ్చు.. తగలబడుతోన్న అడవి

నల్లమల్ల అడవిలో కార్చిచ్చు చెలరేగింది.. దీంతో అడవి తగలబడుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే నల్లమల్ల అడవిలో మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరన్నా కావాలని అంటించారా? లేక ఎండలకు ఇలా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. గత మూడు రోజుల నుంచి కార్చిచ్చు అంటుకున్నట్లు సమచారం.

Click on your DTH Provider to Add TV9 Telugu