Bumper Offer By Cloth Showroom Owner: అసలే కరోనా కాలం. మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే బయటికి వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. అయితే తాజాగా ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవ ఆఫర్ కింద 50 శాతం డిస్కౌంట్ ప్రకటించిందని… కరోనా నిబంధనలను ఉల్లంగిస్తూ యువత ఆ షాప్ ముందు రెండు కిలోమీటర్ల మేరకు బారులు తీరారు. వివరాల్లోకి వెళ్తే..
చెన్నైలో ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో బీసంట్ నగర్ కూడా ఒకటి. అక్కడ మురుగేశన్ అనే బట్టల వ్యాపారి కొత్తగా వస్త్ర దుకాణం ప్రారంభించాడు. ఇక షాప్ ఓపెనింగ్ ఆఫర్ కింద 50 శాతం డిస్కౌంట్ కౌపన్లు ,వెయ్యి రూపాయలకు కంపెనీ బ్రాండెడ్ 10 టీ షర్ట్స్ లేదా జీన్స్ సేల్స్ అంటూ ప్రచారం చేశాడు. ఇంకేముంది వ్యాపారి ప్రకటించిన ఈ బంపరాఫర్‌కు విపరీతంగా ఆదరణ పెరిగింది.. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు యువత ఒకరి మీద ఒకరు ఎగబడుతూ బారులు తీరారు. దీనితో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఇక ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలుసుకుని ఆ షాప్ దగ్గరకు చేరుకున్నారు. షాప్ మొత్తం వందల సంఖ్యలో జనంతో కిక్కిరిసిపోవడం చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా, ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా బంపర్ ఆఫర్ పేరుతో భారీగా జనం పోగవడంతో షాప్ యజమానిఫై కేసు నమోదు చేసి అధికారులు షాప్‌కు సీల్ వేశారు.
Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లు..