గురుద్వారాలో రొట్టెలు కాల్చిన బ్రిటన్ ప్రిన్స్ “చార్లెస్”

బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌ వచ్చారు. నవంబర్‌ 13 బుధవారం ఇండియాకు వచ్చిన ఛార్లెస్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన స్వాగతం పలికారు. ఛార్లెస్‌ పర్యటనలో భాగంగా గురుద్వార్‌ బంగ్లా సాహిబ్‌లో ఆయన రోటీలు కాల్చడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. మొదటి రోజు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన ఛార్లెస్‌ అక్కడి గార్డెన్‌ను నిశితంగా పరిశీలించారు. అక్కడ గల ఔషదీ వనంలో ఛార్లెస్‌ చేతుల మీదుగా ఓ మొక్కను […]

గురుద్వారాలో  రొట్టెలు కాల్చిన బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్
Anil kumar poka

|

Nov 14, 2019 | 2:12 PM

బ్రిటన్‌ రాజు ప్రిన్స్‌ ఛార్లెస్‌ రెండు రోజుల పర్యటన కోసం భారత్‌ వచ్చారు. నవంబర్‌ 13 బుధవారం ఇండియాకు వచ్చిన ఛార్లెస్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఘన స్వాగతం పలికారు. ఛార్లెస్‌ పర్యటనలో భాగంగా గురుద్వార్‌ బంగ్లా సాహిబ్‌లో ఆయన రోటీలు కాల్చడంతో ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది.
మొదటి రోజు రాష్ట్రపతి భవన్‌ను సందర్శించిన ఛార్లెస్‌ అక్కడి గార్డెన్‌ను నిశితంగా పరిశీలించారు. అక్కడ గల ఔషదీ వనంలో ఛార్లెస్‌ చేతుల మీదుగా ఓ మొక్కను నాటించారు. అనంతరం భారత వాతావరణ శాఖను సందర్శించారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల వ్యవస్థ గురించి ఆరా తీశారు. ముఖ్యంగా తుఫానుల్ని ముందుగా ఎలా అంచనా వేస్తారు..? అనే విషయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మెహపాత్ర అన్ని విషయాలను వివరించారు.
ఇక రెండో రోజు నవంబర్‌ 14న గురుద్వార్ బంగ్లా సాహిబ్‌ను సందర్శించారు. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌.  ఢిల్లీ సిక్కు మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రిన్స్‌ ఛార్లెస్‌కు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఛార్లెస్‌ అక్కడి సిక్కులతో సరదా సరదాగా మాట్లాడుతూ కాసేపు సందడి చేశారు. అక్కడివారితో ఫోటోలు దిగారు. అనంతరం గురుద్వార్‌ లోని ప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించిన ఛార్లెస్‌ అక్కడ రోటీల తయారీని చూసి ఆశ్చర్యపోయారు. వారితో పాటుగా రోటీలు కాల్చి అందరిని మరింత ఉత్సహపరిచారు.
Attachments area

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu