జంటగా పయనం..సాధించారు విజయం..ఇది కదా స్పూర్తిపథం!

ఢిల్లీ:  ప్రస్తుత లివింగ్ టుగెదర్, డేటింగ్ జనరేషన్‌లో భార్యభర్తలు ఇద్దరూ కలిసి నిండు జీవితాన్ని వెళ్లదీస్తే అదే గొప్ప విషయం.  చిన్న, చిన్న తగాదాలను సర్దకుపోతూ..గుట్టుగా కాపురాన్ని లాక్కెళ్లిపోతుంటారు ప్రస్తుత మధ్యతరగతి మనుషులు. నిజంగా చెప్పాలింటే అది గొప్ప విషయం. మూములుగా బ్రతికి వెళ్లిపోయినోళ్లే మహానుభావులు. అయితే చత్తీస్‌గఢ్ చెందిన ఓ జంట మిరాకిల్స్ చేసి చూపించారు. పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకుని.. తాము అనుకున్న గోల్స్‌ని కలిసి సాధించారు. అది కూడా సాధాసీదాగా కాదు..  […]

జంటగా పయనం..సాధించారు విజయం..ఇది కదా స్పూర్తిపథం!
Ram Naramaneni

|

Jul 27, 2019 | 3:27 PM

ఢిల్లీ:  ప్రస్తుత లివింగ్ టుగెదర్, డేటింగ్ జనరేషన్‌లో భార్యభర్తలు ఇద్దరూ కలిసి నిండు జీవితాన్ని వెళ్లదీస్తే అదే గొప్ప విషయం.  చిన్న, చిన్న తగాదాలను సర్దకుపోతూ..గుట్టుగా కాపురాన్ని లాక్కెళ్లిపోతుంటారు ప్రస్తుత మధ్యతరగతి మనుషులు. నిజంగా చెప్పాలింటే అది గొప్ప విషయం. మూములుగా బ్రతికి వెళ్లిపోయినోళ్లే మహానుభావులు. అయితే చత్తీస్‌గఢ్ చెందిన ఓ జంట మిరాకిల్స్ చేసి చూపించారు. పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకుని.. తాము అనుకున్న గోల్స్‌ని కలిసి సాధించారు. అది కూడా సాధాసీదాగా కాదు..  ఏకంగా ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలో టాప్ రెండు ప్లేసులు దక్కించుకున్నారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు.

వివరాల్లోకి వెళితే..ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపికవడమే గోల్‌గా పెట్టుకున్నాడు. ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం అవడం మొదలుపెట్టారు. ఈ లోపులోనే పెళ్లి కావడంతో  భార్య విభా సింగ్‌తో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఇటీవల చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌(గ్రేడ్‌ బీ, గ్రేడ్‌ సీ)కు పరీక్ష నిర్వహించగా.. వీరిద్దరూ హాజరయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరూ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేసులు సాధించారు. అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.. విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu