ఇదేం విడ్డూరం…చీర బాగోలేదని పెళ్లి క్యాన్సిల్..

సహజంగా ఫిక్స్ అయిన పెళ్లిళ్లు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయ్..?. వరుడికో, వధువుకో ఎఫైర్స్ ఉన్నాయని తెల్సినప్పుడు, కట్న కానుకల విషయంలో తేడాల వచ్చినప్పడు..లేదా ఆల్రెడీ పెళ్లి అయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు…ఇవి చాలా పెద్ద రీజన్స్. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆఫ్ట్రాల్ పెళ్లి చీర బాగాలేదని ఎవరైనా మ్యారేజ్ చెడగొట్టుకుంటారా..?. అది కూడా సంవత్సరం పాటు ఘాడంగా ప్రేమించినవారిని మిస్ చేసుకుంటారా..? యాజ్‌టీజ్ అక్షరం తప్పు లేకుండా ఇదే […]

ఇదేం విడ్డూరం...చీర బాగోలేదని పెళ్లి క్యాన్సిల్..
Ram Naramaneni

|

Feb 09, 2020 | 9:34 AM

సహజంగా ఫిక్స్ అయిన పెళ్లిళ్లు ఎప్పుడూ క్యాన్సిల్ అవుతాయ్..?. వరుడికో, వధువుకో ఎఫైర్స్ ఉన్నాయని తెల్సినప్పుడు, కట్న కానుకల విషయంలో తేడాల వచ్చినప్పడు..లేదా ఆల్రెడీ పెళ్లి అయిన విషయం దాచి రెండో పెళ్లి చేసుకుంటున్నప్పుడు…ఇవి చాలా పెద్ద రీజన్స్. పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడంలో ఎటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆఫ్ట్రాల్ పెళ్లి చీర బాగాలేదని ఎవరైనా మ్యారేజ్ చెడగొట్టుకుంటారా..?. అది కూడా సంవత్సరం పాటు ఘాడంగా ప్రేమించినవారిని మిస్ చేసుకుంటారా..? యాజ్‌టీజ్ అక్షరం తప్పు లేకుండా ఇదే తంతు జరిగిందండీ.. షాకింగ్‌గా ఉందా..? ఇంకెందుకు ఆలస్యం ఫుల్ స్టోరీలోకి వెళ్దాం పదండి.

కర్ణాటకలోని హసన్ సమీపంలోని గ్రామంలో బీఎన్ రఘుకుమార్, బీర్ సంగీత కుటుంబాలు నివశిస్తున్నాయి. వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా..ప్రేమకు దారితీసింది. పెళ్లికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..ఇక బాజాబజంత్రీలు మోగడమే మిగిలి ఉంది. సరిగ్గా పెళ్లికి ఒక్క రోజు ముందు ఇక్కడో ట్విస్ట్ చోటుచేసుకుంది. వధువు చీర సరైన నాణ్యత లేదని..వరుడు పేరేంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది కాస్తా ఘర్షణకు దారితీసి..ఏకంగా పెళ్లే రద్దైయ్యింది. వధువు పేరేంట్స్ వరుడితో పాటు..అతడి పేరెంట్స్‌‌పై కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న హసన్ పోలీసులు విచారణ చేపట్టారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu