Watch: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా…’ కాదు ఇక్కడ రివర్స్.. నెటిజన్లకు తెగ నచ్చిందిగా..

ఇప్పటి వరకు పెళ్లిలో పెళ్లికూతురు సిగ్గుపడటం మీరు చూసే ఉంటారు కానీ.. ఈ పెళ్లికూతురు కాస్త డిఫరెంట్.. ఈ పెళ్లికూతురు పెళ్లి మండపానికి చేరుకున్న తీరు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు.

Watch: 'నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా...' కాదు ఇక్కడ రివర్స్.. నెటిజన్లకు తెగ నచ్చిందిగా..
Bride Drives Bullet To Reaches Wedding Venue
Follow us

|

Updated on: Jan 21, 2022 | 5:58 PM

ఇప్పటి వరకు పెళ్లిలో పెళ్లికూతురు సిగ్గుపడటం మీరు చూసే ఉంటారు కానీ.. ఈ పెళ్లికూతురు కాస్త డిఫరెంట్.. ఈ పెళ్లికూతురు పెళ్లి మండపానికి చేరుకున్న తీరు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పుడు స్టైల్ మారింది. పెళ్లి కూతురు పూల బుట్టలో.. గుర్రపు బగ్గీలో.. కారులో.. కాదు స్వయంగా బుల్లెట్ బండెక్కి వచ్చేసింది. అవును ఇది నిజం.. తాజాగా అలాంటి అపూర్వ వధువు (bride drives Bullet) వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లి మండపానికి ఇలా కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఇంటి నుంచి ఫంక్షన్ హాల్ వరకు తానే స్వయంగా బుల్లెట్ బండి నడుపుతూ డుగ్గు.. డుగ్గు.. బండిపై వచ్చింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో వధువు  ప్రత్యేకమైన అక్రమార్జనగా నిలిచింది.

ఎరుపు రంగు లెహంగాతో అలంకరించబడిన వధువును వీడియో చూపిస్తుంది. అదే సమయంలో రోడ్డుపై బుల్లెట్ పై డుగ్గు.. డుగ్గు బండిపై తెగ జోష్ లో కనిపిస్తుంది. సోషల్ మీడియా యూజర్లు ఈ వీడియోను విపరీతంగా ఇష్టపడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో “witty_wedding” అనే ఖాతాతో షేర్ చేశారు. వీడియో షేరింగ్ పేజీ అడ్మిన్ మీ ప్రేమ వివాహానికి మీ కుటుంబం అంగీకరించినప్పుడు, క్యాప్షన్‌లో రాశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

వీడియో చూడండి..

దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది

ఈ వీడియోలో పెళ్లికూతురు బాగా పాపులర్ అయ్యారు. అయితే, మరికొందరు ఆమె  భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కనీసం హెల్మెట్ పెట్టుకోలేదని కామెంట్ చేశారు. పెళ్లికి బుల్లెట్ తీసుకొని వీధుల్లోకి రాకూడదని రాశారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని మరొక యూజర్ కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి: TTD: తిరుచానూరులో శ్రీయాగానికి అంకురార్పణ.. ఈ ఏడు రోజులపాటు ఆర్జిత సేవ‌లు ర‌ద్దు..

Covid Claims: లెక్కలు తప్పుతున్నాయి.. కోవిడ్‌ మరణాలపై పరిశోధకుల అనుమానాలు..