Breaking News : తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ…ఇప్పటివరకు ఆమె ఎక్కడ సేవలందించారంటే?

తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా  జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు జడ్డిగా ఆమె  సేవలందించారు. హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2 న ఢిల్లీలో జన్మించారు.

Breaking News : తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ...ఇప్పటివరకు ఆమె ఎక్కడ సేవలందించారంటే?
Follow us

|

Updated on: Dec 15, 2020 | 5:01 PM

తెలంగాణ హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఢిల్లీ హైకోర్టు జడ్డిగా ఆమె సేవలందించారు. హిమా కోహ్లీ 1959 సెప్టెంబర్ 2 న ఢిల్లీలో జన్మించారు. 1979 లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఆనర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. తరువాత  ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ లా సెంటర్‌లో  ‘లా’ అధ్యయనం చేశారు. 1984 లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌తో కోహ్లీ లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ హైకోర్టులో న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్‌కు స్టాండింగ్ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా ఆమె పనిచేశారు. 2006, మే 29న  ఆమె ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007,  ఆగస్టు 29న పూర్తి స్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.  మరోవైపు ఒరిస్సా హైకోర్టు చీఫ్‌గా జస్టిస్ మురళిధర్ నియమితులయ్యారు. 

Also Read :

ప్రిన్సిపాల్ గారూ..! సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు..పిల్లల ముందు చేసేది ఇలాంటి పనులేనా?

55 అడుగుల కొబ్బరి చెట్టుపై అచేతనంగా పడి ఉన్న వ్యక్తి..స్థానికులు సమాచారంతో స్పాట్‌కు పోలీసులు..ట్విస్ట్ ఏంటంటే