కరోనాను జయించిన ఐదునెలల బాలుడు..!

బ్రెజిల్ లో ఐదునెలల బాలుడు.. నెలరోజులకు పైగా కోమా ఉండి.. కరోనాను జయించాడు.

కరోనాను జయించిన ఐదునెలల బాలుడు..!

ప్రపంచాన్ని కబిళిస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు చిన్న పెద్ద తేడా లేకుండా విలవిలలాడుతున్నారు జనం. లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు. బ్రెజిల్ లో ఐదునెలల బాలుడు.. నెలరోజులకు పైగా కోమా ఉండి.. కరోనాను జయించాడు.
బ్రెజిల్ కు చెందిన బేబీ డామ్ ఇంట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీలో కరోనా సోకినట్లు డామ్ తండ్రి సీఎన్ఎన్ మీడియాకు తెలిపాడు. పార్టీ జరిగిన కొద్ది రోజులకు డామ్ కు అనారోగ్యం తలెత్తితే ఆస్పత్రికి తరలించామన్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ జరిగే సమయంలో డామ్ కోమాలోకి వెళ్లాడని…34రోజుల తరువాత స్పృహలోకి వచ్చాడని వెల్లడించాడు. అనంతరం తన కుమారుడికి మరోసారి జలుబు, దగ్గు వచ్చిందని టెస్ట్ లు చేయగా అందులో ఏదో ఇన్‌ఫెక్షన్ వల్ల అనారోగ్యానికి గురైనట్లు డాక్టర్లు చెప్పారు. అత్యవసర చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలించగా కరోనా సోకినట్లు తేలిందని డామ్ తండ్రి వెల్లడించారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో డామ్ కి చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ప్రస్తుతం డామ్ కు కరోనా తగ్గిందని, త్వరలో డిశ్చార్జ్ అవుతున్నట్లు డామ్ తండ్రి ఆనందం వ్యక్తం చేశాడు.