బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్, అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు రెగ్యులేటర్ ఆమోదం, టీకామందు తీసుకున్న నర్సు

బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలయింది. దీంతో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను దేశ హెల్త్ రెగ్యులేటర్ 'అన్ విసా' అనుమతించింది..

  • Umakanth Rao
  • Publish Date - 10:07 am, Mon, 18 January 21
బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్, అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు రెగ్యులేటర్  ఆమోదం, టీకామందు తీసుకున్న నర్సు

బ్రెజిల్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ మొదలయింది. దీంతో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లను దేశ హెల్త్ రెగ్యులేటర్ ‘అన్ విసా’ అనుమతించింది. చైనాకు‌లోని  సినోవాక్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేసిన ‘కొరోనావాక్’, బ్రిటన్ ఆక్స్ ఫర్డ్ వారి ఆస్ట్రాజెనికా టీకామందుల వినియోగానికి అన్ విసా ఏకగ్రీవ అనుమతినిచ్చింది. దేశంలో 54 ఏళ్ళ ఓ నర్సు కొరోనావాక్ వ్యాక్సిన్ తీసుకున్న తొలి మహిళ అయింది. బ్రెజిల్ లో ఇప్పటికే సుమారు 2 లక్షలమంది కోవిడ్ బారిన పడి మరణించారు. ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోవడానికి నిరాకరించిన అధ్యక్షుడు జైర్ బొల్సోనారో..ఇక దేశంలో వ్యాక్సిన్ల వినియోగానికి అంగీకరించక తప్పలేదు. ఈయన రెండు సార్లు కరోనా వైరస్ పాజిటివ్‌కి గురయ్యారు. ఇప్పుడు అయిష్టంగా ఇందుకు ఒప్పుకున్నారు. బ్రెజిల్‌లో ఒకరోజులో సుమారు 10 లక్షలమందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్నది అధికారుల లక్ష్యంగా ఉంది. బ్రెజిల్ వాసులను తమ దేశంలో ప్రవేశించకుండా బ్రిటన్, ఇటలీ ఆంక్షలు విధించాయి.

కాగా ముఖ్యంగా  ఆస్ట్రాజెనికా టీకామందు సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఇప్పటికే కొన్ని లక్షల డోసుల ఆస్ట్రాజెనికా ఇక్కడికి  చేరాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల ఆలస్యం కావడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

Also Read:

కేంద్రీయ విద్యాలయాల్లోని ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి… రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్

Akhilapriya’s Bail Petition: అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సికింద్రాబాద్‌ కోర్టులో విచారణ..

Father And Son Die: ప్రాణాలు తీసిన కోడికూర వంట.. విద్యుదాఘాతంతో తండ్రీకొడుకుల మృతి..